
రక్షాబంధన్ సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ చేసిన ఒక ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కమర్షియల్ యాడ్ పెద్ద దుమారం రేపుతోంది. ఈ యాడ్‌లో కృతి వేసుకున్న మోడ్రన్ ఇండో-వస్టర్న్ డ్రెస్, అలాగే ఓ పెంపుడు కుక్కకు (Pet Dog) రాఖీ కట్టడం నెటిజన్ల మధ్య పెద్ద వార్‌కే దారితీసింది. వస్త్రాధారణలో సంప్రదాయాలను మంటకలుపుతున్నారంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. అటు కృతి కూడా గట్టి కౌంటర్ ఇచ్చేసింది.
బికినీ తరహా దుస్తుల్లో రాఖీనా?
ఈ వివాదంలోకి ఫైర్ బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్ ఎంటర్ అవ్వడంతో రచ్చ నెక్స్ట్ లెవెల్‌కి చేరింది.ఇది కావాలని చేసిన వికారమైన ప్రయత్నం. నేటి మహిళలకు సారీలు, లెహంగాలు, జీన్స్ నుంచి బికినీల వరకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. అలాంటప్పుడు బికినీ తరహా దుస్తుల్లో సొంత సోదరుడికి రాఖీ కట్టాల్సిన అవసరమేంటి? అంటూ కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా ఏకిపారేసింది.
కంగనాకు కృతి కౌంటర్..
ఈ ఆన్‌లైన్ ట్రోలింగ్, విమర్శలపై కృతి సనన్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. స్త్రీలు ఏ దుస్తులు వేసుకోవాలో చెప్పడం సమాజం ఇంకెప్పుడు ఆపుతుంది? అంటూ ఘాటుగా ప్రశ్నించింది. పండుగల పరమార్థం వేసుకునే బట్టల్లో కాదు, ఆ సంప్రదాయం పట్ల ఉన్న భావోద్వేగాల్లో ఉంటుందని కృతి స్పష్టం చేసింది. సంస్కృతి, సంప్రదాయాలు మహిళల హృదయాల్లో ఉంటాయి తప్ప, వారి నెక్‌లైన్ లో కాదంటూ గట్టిగా ఇచ్చిపడేసింది.
కుక్కకు రాఖీ కడితే తప్పేంటి?
రాఖీ అనేది కేవలం అన్నాచెల్లెళ్ల రక్షణ బంధం మాత్రమే కాదని, ప్రేమకు సంకేతమని కృతి వ్యాఖ్యానించింది. నా చెల్లెలు, నేను ఒకరికొకరం రాఖీలు కట్టుకుంటాం. అలాగే మా ఇంట్లోని పెంపుడు కుక్కలు కూడా మా కుటుంబంలో భాగమే. వాటి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోసం ప్రార్థిస్తూ రాఖీ కట్టడంలో తప్పేముంది? అని ప్రశ్నించింది. ఫ్యాషన్ ప్రపంచం ఎంతో మారినా, నేటికీ స్త్రీల గౌరవాన్ని, సంస్కృతిని వారు వేసుకునే దుస్తుల ప్రాతిపదికనే కొలవడం విచారకరమని కృతి పేర్కొంది. ప్రస్తుతం ఈ ఇద్దరి భామల వస్త్ర యుద్ధం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది…
ALSO READ : రవితేజ ‘ఇరుముడి’కి బిగ్ షాక్..
I just saw an entire thread on Kriti Sanon’s CLOTHES in a Rakhi Ad.
CLOTHES. YUP. You read that right.
And A RAKHI AD!Rakhi, a festival literally to celebrate the relationship between a brother and a sister (discussions about the patriarchal ramifications of the same…
— Dr.Medusa (@ms_medusssa) August 24, 2026