
సెయింట్ లూయిస్ (అమెరికా): ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్ చివరి అంచె పోటీలకు అర్హత సాధించాడు. జర్మనీ గ్రాండ్ మాస్టర్ విన్సెంట్ కీమర్‌తో జరిగిన సెమీస్ గేమ్‌ల్లో ప్రజ్ఞా 19–9తో విజయం సాధించాడు. రెండో క్లాసికల్ గేమ్‌లో కీమర్‌ను ఓడించిన ఇండియన్ ప్లేయర్..
ర్యాపిడ్ గేమ్స్‌లోనూ అదే ఆధిపత్యం చూపెట్టాడు. 17–3 పాయింట్ల తేడాతో కీమర్‌పై నెగ్గి ఫైనల్ పోటీలకు తన స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు. ఆ తర్వాత జరిగిన బ్లిట్జ్ తొలి గేమ్‌లోనూ ప్రజ్ఞానంద విజయం సాధించడంతో పాయింట్ల సంఖ్య 19కి చేరింది. నిబంధన ప్రకారం అన్ని గేమ్స్ ఆడాల్సి ఉన్నా.. స్కోరు పరంగా విజయావకాశాలు లేనప్పటికీ కీమర్ చివరి మూడు బ్లిట్జ్ గేమ్స్‌లో విజయం సాధించి పోరాట స్ఫూర్తి చూపెట్టాడు.
గ్రాండ్ ఫినాలేలో ప్రజ్ఞానంద.. ఫ్యాబియానో కరువాన (అమెరికా)తో తలపడనున్నాడు. ఇతర సెమీస్ గేమ్‌లో కరువాన (18.. వెస్లీ సో (అమెరికా, 9)పై విజయం సాధించాడు. మూడో స్థానం కోసం జరిగే పోరులో కీమర్.. వెస్లీ సోతో తలపడతాడు. ఈ టోర్నీలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన ప్లేయర్లు వచ్చే ఏడాది జరిగే గ్రాండ్ చెస్ టూర్‌లో నేరుగా పాల్గొంటారు.