
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ లేటెస్ట్ గా నటించిన ఓ రాఖీ స్పెషల్ జ్యువెలరీ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. రక్షా బంధన్ పండగను ఆధునిక టచ్‌తో చూపించేందుకు రూపొందించిన ఈ ప్రకటనలో కృతి ఇండోవెస్ట్రన్ కాంభినేషన్ లో ఆఫ్-వైట్ బ్రాలెట్‌తరహా బ్లౌజ్, కేప్, డ్రేప్డ్ స్కర్ట్‌తో కనిపించారు. అయితే ఇదే లుక్ కొందరు నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.
పవిత్రమైన రాఖీ పండగను చూపించే యాడ్‌లో ఇలాంటి దుస్తులతో గ్లామర్ ప్రదర్శన ఏంటంటూ పలువురు ప్రశ్నించారు. మరికొందరు పూజా పళ్లెం, తిలకం వంటి సంప్రదాయ అంశాలు ఎక్కడున్నాయని నిలదీశారు. దీనికి తోడు యాడ్‌లో కృతి ఒక పెంపుడు కుక్కకు కూడా రాఖీ కట్టే సన్నివేశం ఉండటంతో వివాదం మరింత ముదిరింది.
ఈ విమర్శల గందరగోళంలోకి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ , బీజేపీ ఎంపీ కంగనా ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిలలకు ప్రస్తుతం ఎన్నో అద్భుతమైన దుస్తుల ఆప్షన్లు అంటుబాటులో ఉన్నాయి. కాక్టైల్ డ్రెస్సుల నుంచి లెహంగా చోలీలు, జీన్స్ , చీరలు, బికినీల నుంచి సల్వార్ కమీజ్ వరకు ఎన్నో ఆప్షన్లు ఉండగా.. సోదరుడికి బికినీ, లోదుస్తుల్లో రాఖీ కట్టాల్సిన అవసరం ఏ మొచ్చింది? అంటూ ఫైర్ అయింది అసలు మీ స్టైల్లింగ్ సెన్స్ ఏమైంది? ఈ యాడ్ కావాలని వివాదాస్పదంగా రూపొందించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది అంటూ మండిపడింది..
మరో వైపు సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు #BoycottGIVA అనే హ్యాష్‌ట్యాగ్‌తో విరుచుకుపడుతున్నారు. పూజ థాలీ ఎక్కడ? తిలకం ఏది? అన్నదమ్ములకు రాఖీ కట్టే సమయంలో బ్రాలెట్ లు వేసుకోవడం ఏ సంప్రదాయం అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు హిందూ సంస్కృతిని వ్యాపారం కోసం తక్కువ చేసి చూపుతున్నారు అంటూ మండిపడుతున్నారు. అయితే ఈ విమర్శలపై కృతి సనన్ గానీ, సదరు జ్యువెలరీ సంస్థ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. మరి రాఖీ యాడ్ వివాదంపై ఎలా స్పందిస్తారో చూడాలి..