
సూపర్ స్టార్ మహేష్ బాబు, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ అనగానే సినీ ప్రియులకు ‘ సరిలేరు నీకెవ్వరు ‘ మూవీ గుర్తుకొస్తుంది. అయితే ఈ హిట్ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతే కాదు .. మహేష్ బాబు ‘ వారణాసి ‘ తర్వాత అనిల్ సినిమా చేస్తారని .. 2028 సంక్రాంతికి ఈ మూవీని తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారంటూ టాక్ వినిపడింది. అయితే లేటెస్ట్ గా ఈ ఊహాగానాలపై దర్శకుడు అనిల్ రావిపూడి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
రూమర్స్ కు అనిల్ క్లారిటీ..
మహేష్ బాబుతో కలిసి మరో మూవీ చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై దర్శకుడు అనిల్ రావిపూడి పూర్తిగా ఖండించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నాకెంతో ఆత్మీయులు. ఆయనపై నాకు ఎప్పుడూ అపారమైన ప్రేమ, గౌరవం ఉంటాయి. ప్రస్తుతం మా కాంబినేషన్‌పై సర్క్యులేట్ అవుతున్న వార్తలన్నీ పూర్తిగా అబద్ధం. దయచేసి ఇటువంటి రూమర్లను నమ్మకండి, ప్రచారం చేయకండి అని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.
‘వారణాసి’ మోడ్‌లో మహేష్ ..
ప్రస్తుతం మహేష్ బాబు తన డ్రీమ్ ప్రాజెక్ట్, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గ్లోబల్ అడ్వెంచరస్ చిత్రం ‘వారణాసి’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన ‘రుద్ర’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ప్రియాంక చోప్రా , పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ డ్రామాను ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మల్టీపుల్ టైమ్‌లైన్స్, ఆస్టరాయిడ్ బ్యాక్‌డ్రాప్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ విజువల్ వండర్ కోసం మహేష్ తన సమయాన్ని పూర్తిగా కేటాయించారు.
ALSO READ : Toxic Box office Collection: బాక్సాఫీస్ వద్ద యశ్ ‘టాక్సిక్’ సునామీ
ఫుల్ బిజీగా అనిల్..
మరోవైపు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రం’ జనవరి 12 విడుదల ‘తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మూవీలో హీరోలుగా విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్.. కథానాయికలుగా కీర్తి సురేశ్, కృతిశెట్టి నటిస్తున్నారు. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తున్నాయి. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతానికి మహేష్ బాబుతో సినిమా లేదని అనిల్ రావిపూడి క్లారిటీ ఇవ్వడంతో.. ఊహాగానాలకు తెరపడింది..
Superstar @UrstrulyMahesh garu has always been a dear person to me. ❤️
I have immense love and respect for him, always. 🙏🏻
Whatever news is currently circulating is completely false and untrue. Please don’t believe or spread such rumours. https://t.co/VrSEJOF9yI
— Anil Ravipudi (@AnilRavipudi) August 25, 2026