Reading Time: < 1 minute
SL vs IND: కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబు‌లో భారీ జంప్..?

WTC Points Table After SL vs IND 2nd Test: కొలంబో టెస్టులో టీమిండియా పట్టు సాధించింది. దేవదుత్ పడిక్కల్ 117 పరుగులతో, ధ్రువ్ జూరెల్ అజేయంగా 115 పరుగులతో సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక టీం 2 కీలక వికెట్లు కోల్పోయి రెండో రోజును ముగించింది. ఇక మూడో రోజు ఒత్తిడిలో బ్యాటింగ్ చేస్తోన్న లంక టీం ప్రస్తుతం వార్త రాసే సరికి 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఇంకా 298 పరుగుల వెనుకంజలో నిలిచింది.

మూడో రోజు టీమిండియా బౌలర్లు విజృంభించడంతో లంక టీం కష్టాల్లో కూరకపోయింది. ఈ టెస్ట్ సిరీస్‌పై కన్నేసిన భారత జట్టు కొలంబోలో ఆధిపత్యం సాగిస్తోంది. రెండో రోజు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల మెరుపులతో భారీ స్కోరు చేసిన టీమిండియా మ్యాచ్‌ని తన చేతుల్లోకి తీసుకుంది. మొత్తంగా, ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై టీమిండియాకే గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఎక్కువమంది చదివినది: Video: 0,W,4,0,W,0.. ఒకే ఓవర్లో 2 వికెట్లతో చెలరేగిన బుడ్డోడు.. సెలబ్రేషన్స్ చూస్తే ఫిదానే..!

కొలంబో టెస్టులో గిల్ సేన గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ, WTC) పాయింట్ల పట్టికలో టీమిండియాకు భారీ లాభం చేకూరే ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్ ఓడిపోయినప్పటికీ, కొలంబోలో టీమిండియా గెలిస్తే పాయింట్ల శాతం 57.57కు చేరి బంగ్లాదేశ్‌ను వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి ఎగబాకుతుంది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్ ఆశలు మరింత బలోపేతం అవుతాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..