
ఇయర్ ఆఫ్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్స్‌గా మారిపోతుంది 2026. ఈ ఏడాదిలో ఏం మ్యాజిక్ ఉందో తెలియదు కానీ ఫ్లాపుల్లో ఉన్నవాళ్లంతా ఒక్కొక్కరిగా రోరింగ్ కమ్ బ్యాక్ ఇస్తున్నారు. కొందరు హిట్స్ కొడుతుంటే.. మరికొందరైతే హిస్టరీ రీసౌండ్ వచ్చేలా బాక్సాఫీస్ బద్ధలు కొడుతున్నారు. తాజాగా ఇరుముడితో రవితేజ ఇదే చేస్తున్నారు. అసలు ఈ చిత్రం రేంజ్ ఎంత.. ఎక్కడ ఆగబోతుంది..? 2026 స్ట్రాంగ్ కమ్ బ్యాక్స్‌లో రవితేజ కూడా చేరిపోయారు. ఈయనకు ముందు చిరంజీవి, సూర్య, అఖిల్, వరుణ్ తేజ్, సమంత ఇలా చాలా మంది స్టార్స్ ఈ ఏడాది అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. వీళ్లందరినీ మరిపించేలా ఇరుముడితో ఇరగ్గొడుతున్నారు మాస్ రాజా. కమ్ బ్యాక్ కాదిది.. ఊహకందని ఊచకోత కోస్తున్నారు ఈ హీరో. తొలిరోజే ఏకంగా 69 శాతం రివకరీ చేసింది ఇరుముడి. శివనిర్వాణ తెరకెక్కించిన ఇరుముడిపై ముందు నుంచి ఏదో తెలియని ఓ పాజిటివ్ వైబ్ అయితే కంటిన్యూ అయింది. ట్రైలర్ విడుదల తర్వాత అది మరింత పెరిగింది. కచ్చితంగా రవితేజ గత సినిమాలతో పోలిస్తే మంచి ఓపెనింగ్ వస్తుందని తెలుసు కానీ ఏకంగా రికార్డ్ ఓపెనింగ్ వచ్చింది. తొలిరోజే 25 కోట్ల గ్రాస్.. 14 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఇరుముడి. తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్లకు ఇరుముడిని అమ్మారు.. అలాగే వరల్డ్ వైడ్ బిజినెస్ 21 కోట్లు మాత్రమే..! రెండో రోజు మధ్యాహ్నానికే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకున్న ఇరుముడి.. మూడో రోజు నుంచి లాభాల పంట పండించనుంది. ఈ సినిమా జోరు చూస్తుంటే 50 కోట్ల షేర్ కూడా పెద్ద కష్టమేం కాదనిపిస్తుంది. ధమాకాతో 100 కోట్లు కొట్టిన రవితేజ.. ఇరుముడితో ఆ రికార్డ్ దాటేసేలా కనిపిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price: పసిడి పరుగులు.. ఇవాళ తులం బంగారం ధర ఇదే!
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
ఎయిర్‌హోస్టెస్ నుంచి పోలీస్ ఆఫీసర్‌గా వచ్చింది.. అవినీతి ఊబిలో చిక్కుకొని..
2026 Lunar Eclipse: ఆగస్టు 28న ఆకాశంలో అద్భుతం.. భారత్‌లో కనిపిస్తుందా?
గంటల తరబడి మొబైల్ చూస్తున్నారా? మీ వెన్నెముకకు ముప్పు తప్పదు!