
సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ & సన్స్’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుని ట్రేడ్ వర్గాలను షేక్ చేస్తోంది. ఇక అమెరికాలోనూ సూర్య హవా కొనసాగుతోంది. ఇప్పటికే USAలో 2.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లతో అక్కడ కూడా అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలోనే సినిమా సక్సెస్పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రాన్ని చూసి సోషల్ మీడియా వేదికగా తన రివ్యూ పంచుకున్నారు. సినిమా చాలా అందంగా, హృదయానికి హత్తుకునేలా ఉందని ప్రశంసించారు.
200 CRORES+ Worldwide Gross ❤️❤️
And still counting 🫶🏻🫶🏻#VishwanathAndSons continues its phenomenal run with families coming together and celebrating every emotion on the BIG SCREENS ❤️🔥#BlockbusterVAS#BlockbusterVishwanathAndSons@Suriya_offl #VenkyAtluri @_mamithabaiju… pic.twitter.com/hYciSSKTND— Sithara Entertainments (@SitharaEnts) August 23, 2026
ఈ పాత్ర కోసమే సూర్య పుట్టినట్టుంది: కార్తికేయ
“ఈ పాత్ర కోసమే సూర్య పుట్టినట్టుంది”.. కార్తికేయసూర్య ఈ పాత్ర కోసమే పుట్టినట్టుగా ఉన్నారని, మమితా బైజు ఎనర్జీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని కార్తికేయ పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంటర్వ్యూ సన్నివేశం ఇటీవల కాలంలో చూసిన అత్యుత్తమ సన్నివేశాల్లో ఒకటని ప్రశంసించారు. వెంకీ అట్లూరి మరోసారి తనదైన మార్క్‌తో విజయం సాధించారని అన్నారు. నిర్మాత వంశీకి, చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ ఈ సినిమా కాలం గడిచేకొద్దీ.. మరింత గుర్తుండిపోతుందని కార్తికేయ ట్వీట్ చేశారు.
జక్కన్నకు సినిమా చూపించవా బ్రో: నాగవంశీ రిక్వెస్ట్
కార్తికేయ ప్రశంసలకు నిర్మాత నాగవంశీ స్పందిస్తూ స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. ‘‘దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి గారికి దయచేసి సినిమా చూపించవా బ్రో! ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది’’ అంటూ పోస్ట్ చేశారు. ‘‘థ్యాంక్యూ కార్తిక్. ప్లీజ్ ఎస్.ఎస్. రాజమౌళి గారిని సినిమా చూడమని అడుగు. ఆయన అభిప్రాయం తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది’’ అంటూ నాగవంశీ ట్వీట్ చేశాడు.
Thankyou karth @ssk1122 Pls ask @ssrajamouli garu to watch it… would love to know his opinion 🤗♥️ https://t.co/jzKbQbWf9x
— Naga Vamsi (@vamsi84) August 23, 2026
దీంతో రాజమౌళి ‘విశ్వనాథ్ & సన్స్’పై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారోనన్న ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది. అయితే, జక్కన్న సినిమా చూసి ట్వీట్ చేస్తే.. ఆనందంతో పాటుగా వసూళ్లు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుందని నాగవంశీ ఈ స్పెషల్ రిక్వెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.
వెంకీ అట్లూరి రైటింగ్ ఇంపాక్ట్..
దర్శకుడు వెంకీ అట్లూరి రైటింగ్‌పై ట్రేడ్‌లో ఏర్పడిన నమ్మకమే ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అతిపెద్ద బలంగా మారింది. సాధారణ కథలను బలమైన భావోద్వేగాలు, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకునేలా చెప్పడంలో వెంకీకి ప్రత్యేక గుర్తింపు ఉంది.
‘సార్’తో సామాజిక అంశాన్ని హిట్‌గా మలిచిన వెంకీ అట్లూరి.. ‘లక్కీ భాస్కర్’లో మధ్యతరగతి వ్యక్తి జీవితాన్ని థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు దగ్గర చేశారు. అదే ఎమోషనల్ రైటింగ్, రిలేటబుల్ క్యారెక్టరైజేషన్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లోనూ చూపించి సక్సెస్ కొట్టారు. సూర్య స్టార్‌డమ్‌కు వెంకీ అట్లూరి రచన, కథనం తోడవడంతో ఈ సినిమా ఇంతటి భారీ హైప్‌ను సొంతం చేసుకుంది.