
కొలంబో: రెండో టెస్ట్‌లో వాగ్వాదానికి దిగిన ఇండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్, లంక పేసర్ అసితా ఫెర్నాండోపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఇద్దరికీ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. అలాగే ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.12ను ఉల్లంఘించినందుకు ఇద్దరు ప్లేయర్లకు ఒక్కో డీమెరిట్ పాయింట్‌ను కేటాయించారు. గత 24 నెలల్లో వీరిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు లేకపోవడంతో తక్కువ శిక్షతోనే సరిపెట్టారు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ప్రతిపాదించిన ఈ శిక్షను ఇద్దరు ప్లేయర్లు అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేదని ఐసీసీ వెల్లడించింది.