
దేవర రిలీజ్ కాకుండానే జాన్వి కపూర్ పెద్ద ఛాన్స్ కొట్టేసింది. పెద్ది రిలీజ్ అయి ఓటీటీ లోకి వచ్చేసినా, జాన్వి కపూర్ కి మరొక తెలుగు సినిమా దక్కలేదు. పెద్దితో ఫేడ్ అవుట్ అయిపోయినట్టేనా? తెలుగు సినిమాలకు దూరంగా ఉండాలి అనుకుంటుందా, లేదంటే అసలు ఈ అమ్మని పట్టించుకునేవాడే లేడా? అనే చర్చ సంచలనం రేపుతోంది. జాన్వి కపూర్ టాలీవుడ్ పై చాలా ఆశలు పెట్టుకుంది. డెబ్యూ మూవీ ‘ధడక్’ హిట్ తర్వాత హిందీలో ఎన్ని సినిమాలు చేసినా సరైన సక్సెస్ లేదు. దేవర ఆఫర్ రావడంతో జాన్వికి పాన్ ఇండియా క్రేజ్ రావడమే కాదు, రెమ్యునరేషన్ నాలుగు కోట్లకు చేరింది. దేవరలో ఈ అమ్మడిది స్కిన్ షో తప్ప గుర్తుండిపోయే పాత్ర కాదు. ఇక పెద్ది దగ్గరికి వచ్చేసరికి ఆరు కోట్ల పారితోషకం డిమాండ్ చేసి అనుకున్నంత సాధించింది జాన్వి. తెలుగు దర్శకులు జాన్వి కపూర్ ను బోల్డ్ గానే చూపించారు. దేవర సినిమాలో కనిపించింది తక్కువ సేపైనా, స్కిన్ షో కోసమే జాన్విని తీసుకున్నట్టుగా చిత్రీకరించాడు దర్శకుడు కొరటాల శివ. పెద్ది దగ్గరికి వచ్చేసరికి బుచ్చిబాబు మరింత రెచ్చిపోయి జాన్వితో హద్దులు దాటించేశాడు. పల్లెటూరి అమ్మాయిలు ఇలాగే ఉంటారా? అనిపించేలా చీప్ గా చూపించాడు బుచ్చిబాబు.
జాన్వి తెలుగులో రెండు పాన్ ఇండియా మూవీస్ లో నటించే ఛాన్స్ వస్తే, విమర్శలు, ట్రోలింగ్ రూపంలో బ్యాడ్ అయింది. అగ్లీ రోల్ ఎఫెక్ట్ ఆమె కెరీర్ పై పడి అసలు ఆఫర్స్ రావడమే మానేశాయి. ఈ ఊహించని డర్టీ ఇమేజ్ నుంచి బయట పడాల్సింది పోయి, రీసెంట్ గా ఇన్స్టా వేదికగా గ్లామర్ ఫోటోలు షేర్ చేసి తగ్గేదే లేదంటోంది జాన్వి. చూస్తుంటే జాన్వి కపూర్ కెరీర్ కు తెలుగులో ఫుల్ స్టాప్ పడేట్టే కనిపిస్తోంది. ‘రాకా’లో జాన్వి నటిస్తోందంటూ ఆ మధ్య వార్తలు వచ్చినా, పెద్ది దెబ్బకు ఈ ఛాన్స్ చేతికి వస్తుందో, లేదో కూడా తెలియడం లేదు. ఏ విషయంలో అయినా అతి పనికిరాదు. గ్లామర్ విషయంలో హద్దు దాటేసి ప్రదర్శించడంతో అసలుకే మోసం వచ్చినట్టయింది.