Reading Time: 2 minutes

David Warner: అయ్యప్ప మాలలో డేవిడ్ వార్నర్.. రవితేజ ‘ఇరుముడి’ మానియాకు గ్లోబల్ ఫిదా!

Caption of Image.

మాస్ మహారాజా రవితేజ్ ఫుల్ జోష్ లో ఉన్నారు. చాలా కాలంగా ఒక సాలిడ్ కమర్షియల్ హీట్ కోసం ఎదురుచూస్తున్న ఆయన కోరిక ఎట్టకేలకు నెరవేరింది. శివ నిర్వాణ  దర్శకత్వంలో తెరకెక్కిన ‘ ఇరుముడి ‘ భారీ అంచనాల మధ్య ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. 

రూ. 100 కోట్ల క్లబ్ లో.. 

కేవలం ఈ నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా రాబట్టింది. రవితేజ కెరీర్ లోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన చిత్రంగా ‘ఇరుముడి’ నిలిచింది. ఎమోషనల్ అండ్ డివోషనల్ యాక్షన్ డ్రామాగా మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మించింది. ఊహించని స్థాయిలో ప్రేక్షకుల మన్ననలను పొందుతోంది.

నెట్టింట గ్రోబల్ ట్రెండ్..

ఈ సినిమా సృష్టించిన వైబ్అంతర్జాతీయ స్థాయికి పాకింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మాజీ కెప్టెన్, ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ‘ఇరుముడి’ మానియాలో మునిగిపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లోని ‘orangearmyforever’ అనే ఫ్యాన్ పేజ్, రవితేజ గెటప్‌ ఆధారంగా వార్నర్ భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి మాల ధరించినట్లు ఒక డిజిటల్ ఆర్ట్‌ను క్రియేట్ చేసింది.  తనపై ఉన్న తెలుగు అభిమానుల ప్రేమకు ఫిదా అయిన వార్నర్.. ఆ వైరల్ ఫ్యాన్-ఎడిట్ పోస్టర్‌ను స్వయంగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.  గతంలోనూ ఆయన తెలుగు పాటలు.. ‘పుష్ప’ స్టెప్పులతో అభిమానులను అలరించారు.

►ALSO READ | Kangana Ranaut: బికినీలో రాఖీ కట్టాల్సిన అవసరమేంటి?.. కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై కంగనా రనౌత్ ఫైర్‌!

చాలాకాలం తర్వాత ఒక సాలిడ్ కమర్షియల్ విక్టరీ కావాలని కోరుకున్న మాస్ రాజాకు, దర్శకుడు శివ నిర్వాణ ‘ఇరుముడి’రూపంలో కెరీర్ బెస్ట్ ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్‌ను అందించారని థియేటర్ల వద్ద అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మొత్తానికి రవితేజకు కావాల్సిన భారీ కమ్ బ్యాక్ ను ఈ మూవీ అందించడంతో ఫుల్ జోష్ లో మునిగిపోయారు మాస్ మహారాజా… 
 

 

©️ VIL Media Pvt Ltd.