Reading Time: < 1 minute

తెలంగాణ ట్రాన్స్ కో CMDని కలిసిన ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్

Caption of Image.

తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ అండ్ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆగస్టు 25న ఈ రోజు హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ట్రాన్స్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ భాస్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

సంస్థలో ప్రమోషన్లకు సంబంధించి మెరిట్ కం సీనియారిటీ అంశంపై వారు సీఎండీకి ఒక వినతి పత్రం అందజేశారు. దశాబ్దాలుగా సంస్థలో ప్రమోషన్లలో సీనియారిటీ కోసం రోస్టర్ విధానం అమలులో ఉండేదని, అయితే దానికి భిన్నంగా నూతనంగా మెరిట్ కం సీనియారిటీ అవలంబించడం వల్ల సీనియారిటీలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

కనుక ప్రమోషన్ లేదా సీనియారిటీ నిర్ణయించే విషయంలో పాత రోస్టర్ విధానాన్నే అమలుపరచాలని వారు విజ్ఞప్తి చేయగా, సీఎండీ కృష్ణ భాస్కర్ దీనిపై సానుకూలంగా స్పందించారు.

ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ ఆరేపల్లి మోహన్, రాష్ట్ర కార్యదర్శి బక్క దానయ్య, సంఘ నాయకులు పి. రామస్వామి, జిల్లా శంకర్, కుమార స్వామి, జడల రవి, రాంబాబు, బక్కెల్లి రవి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

©️ VIL Media Pvt Ltd.