Reading Time: < 1 minute
Tollywood Director Pavan Sadineni Arrested After Lady Artist Files Sexual Complaint

Tollywood director Pavan Sadineni Arrest: పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీసిన ట్యాలెంటెడ్ టాలీవుడ్‌ డైరెక్టర్ పవన్‌ సాదినేని అరెస్ట్‌ అయ్యాడు. ఓ లేడీ ఆర్టిస్ట్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అవకాశాలు ఇప్పిస్తానంటూ తనను మోసం చేశాడని, చాలాకాలం పాటు సహజీవనం చేసి తనను లైంగికంగా వాడుకున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి.. అనంతరం మోసం చేశాడని సదరు ఆర్టిస్ట్‌ చెప్పుకొచ్చింది.

అరెస్ట్‌ ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. అనంతరం డైరెక్టర్ పవన్‌ సాదినేనిని అరెస్ట్‌ చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆరోపణలకు సంబంధించిన ఆధారాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పవన్‌ సాదినేని టాలీవుడ్‌లో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘సావిత్రి’, ‘సేనాపతి’ వంటి చిత్రాలను తెరకెక్కించారు. సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌ల ద్వారా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం పవన్‌ సాదినేని మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దుల్కర్‌ సినిమాపై పవన్‌ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇంతలోనే అతడిపై లేడీ ఆర్టిస్ట్‌ ఫిర్యాదు చేసింది. పవన్‌ అరెస్ట్‌ వార్త టాలీవుడ్‌లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేసులో వాస్తవాలు ఏంటి?.. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఏవి? అనే విషయాలు విచారణ పూర్తయిన తర్వాతే స్పష్టత రానుంది. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.