Reading Time: < 1 minute

వరంగల్ : పోలీస్స్టేషన్లలో ఎస్పీల వార్షిక తనిఖీలు

Caption of Image.

వెంకటాపూర్/ గోవిందరావుపేట/ చిట్యాల, వెలుగు: వార్షిక తనిఖీల్లో భాగంగా ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ మంగళవారం గోవిందరావుపేట మండలం పస్రా పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించారు. రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది విధులపై సమీక్షించారు. ప్రజల ఫిర్యాదులపై వేగంగా స్పందించి, పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు గంజాయి, ఇతర అక్రమ కార్యకలాపాలపై నిఘా పెంచాలని ఆదేశించారు. సిబ్బంది సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో ములుగు డీఎస్పీ నలువాల రవీందర్, సీఐ దయాకర్, ఎస్సై తాజుద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు.

చిట్యాల పీఎస్​లో ఎస్పీ తనిఖీ..

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నిష్పాక్షిక సేవలు అందించాలని జయశంకర్​భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం చిట్యాల పీఎస్​ను సందర్శించి పెండింగ్ కేసులు, సీసీటీఎన్‌‌‌‌‌‌‌‌ఎస్, బ్లూకోల్ట్, సీసీ కెమెరాల పనితీరుపై సమీక్షించారు. వన మహోత్సవంలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. డీఎస్పీ సంపత్‌‌‌‌‌‌‌‌రావు, సీఐ మల్లేష్, ఎస్సై పోచంపల్లి సతీశ్, సిబ్బంది పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.