
బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్ బాస్’కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించిన ‘బిగ్ బాబ్ తెలుగు’ ఈ సారి ల్యాండ్ మార్క్ ‘సీజన్ 10’తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మైల్ స్టోన్ సీజన్ ను మనుపెన్నడూ లేని విధంగా అత్యంత గ్రాండ్ గా , షాకింగ్ ట్విస్టులు, కఠినమైన రూల్స్, అన్ ప్రెడిక్టబుల్ మైండ్ గేమ్స్ తో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్..
‘ బిగ్ బాస్’ అంటేనే సస్పెన్స్, కాంట్రవర్సీలు, టాస్కులు, ఎమోషన్స్.. అన్నీ కలగలిసిన ఫుల్ మీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఇప్పుడు తెలుగులో బిగ్ బాస్ 10వ సీజన్ సందడి మొదలవుతున్న వేళ.. రూమర్డ్ కంటెస్టెంట్ల లిస్ట్ రోజురోజుకూ ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే పలువురు టీవీ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేర్లు వైరల్ అవుతుండగా.. లేటెస్ట్ గా మరో క్రేజీ పేరు తెరపైకి వచ్చింది. అదే హాట్ యాంకర్, నటి వర్షిణి సౌందర రాజన్..
వర్షిణిని బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించగా.. ఈసారి షోలో పాల్గొనేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ బ్యూటీకి బిగ్ బాస్‌కు కొత్తేమీ కాదు. గత కొన్ని సీజన్లుగా ఆమె పేరు వినిపిస్తున్నప్పటికీ.. వివిధ కారణాలతో షోలోకి అడుగుపెట్టలేదు. అయితే ఇప్పుడు మైలురాయి సీజన్ కావడంతో ఆమె ఎంట్రీపై చర్చ మరింత జోరందుకుంది.
ఈ బ్యూటీకి తెలుగు టీవీ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ‘పటాస్ 2’, ‘ఢీ’, ‘జబర్దస్త్’ వంటి కార్యక్రమాలతో యాంకర్‌గా తనదైన స్టైల్ చూపించింది. తన ఎనర్జిటిక్ ప్రెజెన్స్, గ్లామర్, కంటెస్టెంట్లతో చలాకీగా ఇంటరాక్ట్ అయ్యే విధానంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ‘చందమామ కథలు’తో సినిమాల్లోకి అడుగుపెట్టిన వర్షిణి.. ‘లవర్స్’, ‘నన్ను దోచుకుందువటే’, ‘జోడీ’, ‘మళ్లీ మొదలైంది’, ‘శాకుంతలం’ వంటి చిత్రాల్లో కనిపించింది. ‘పెళ్లి గోల’ వెబ్ సిరీస్‌తోనూ గుర్తింపు తెచ్చుకుంది.
ఇదిలా ఉంటే.. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, కావ్యశ్రీ, నటుడు పవన్ కళ్యాణ్, రామ్ ప్రసాద్, ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, నందూస్ వరల్డ్ నందూ, రాయల్ మెక్ రమణ, శివ్ తదితరుల పేర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీరిలో ఎవరెవరు నిజంగా హౌస్‌లోకి వస్తారన్నది మేకర్స్ అధికారిక ప్రకటన తర్వాతే క్లారిటీ వస్తుంది.
ప్రస్తుతం సామాన్యుల ఎంపిక కోసం ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 ‘ కొనసాగుతోంది. వీరిలో 5గురిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించనున్నారు. ఈ షో సెప్టెంబర్ 6 వ తేదీ నుంచి సందడి చేయనుంది. ఇక వర్షిణి నిజంగానే బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడితే మాత్రం.. ఆమె గ్లామర్ మాత్రమే కాదు, యాంకరింగ్ అనుభవం, కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ గేమ్‌లో కీలకంగా మారే అవకాశం ఉంది. మరి వర్షిణి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి మరి..