Reading Time: < 1 minute
The Paradise Second Single Update Kasarla Shyam Blesses Anirudh

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘ది పారడైజ్’. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి అద్భుతమైన సాహిత్యాన్ని అందిస్తున్న ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్, మ్యాజికల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌ను  ఆశీర్వదిస్తున్నపిక్ నాని అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ ప్రత్యేకమైన పిక్‌తో పాటే చిత్రబృందం మరొక క్రేజీ అప్‌డేట్‌ను అందించింది. ‘ది పారడైజ్’ సినిమాలోని సెకండ్ సింగిల్ ను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మొదటి పాట ఆయా షేర్ తో తెచ్చిన జోష్‌తో రాబోయే రెండో పాట కూడా చార్ట్‌బస్టర్‌గా నిలవడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు. మోహన్ బాబు, కయాడు లోహర్, రాఘవ్ జుయల్, సోనాలి కుల్కర్ణి, సంపూర్ణేష్ బాబు వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాను ఎస్‌ఎల్‌వి సినిమాస్  పతాకంపై సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సెకండ్ సింగిల్ తో అనిరుధ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో ఎలాంటి సాంగ్ ఇస్తాడోనని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కోలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది.