
Pakistan Women Cricket: ఆగస్టు 28 నుంచి గ్రాండ్‌గా మొదలుకానున్న ఉమెన్స్ ఆషియా కప్ 2026 కోసం పాకిస్థాన్ ఉమెన్స్ టీమ్ బిగ్ ప్లాన్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. గత పదేళ్లలో ఒక్కసారి కూడా ఆషియా కప్ ఫైనల్‌కి చేరలేకపోయిన పాక్ మహిళల జట్టు, ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. అందుకోసం లహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో అబ్దుల్ ఖాదిర్ క్రికెట్ అకాడమీకి చెందిన మెన్స్ టీమ్ (కుర్రాళ్లు, సీనియర్ ప్లేయర్లు) తో ఏకంగా ఫుల్ 20 ఓవర్ల ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడేసింది. ఏదో ఊరికే నెట్ ప్రాక్టీస్ లేదా చిన్న చిన్న డ్రిల్స్ లాగా కాకుండా, అఫీషియల్ టీ20 రూల్స్‌తో మగ ప్లేయర్ల స్పీడ్ అండ్ ప్రెజర్‌ను తట్టుకుని ఆడడం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రెజర్ హ్యాండిల్ చేయడానికే ఈ స్కెచ్: కెప్టెన్ ఫాతిమా సనా
ఈ డిఫరెంట్ ప్రిపరేషన్ గురించి పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా మాట్లాడుతూ.. మేము ఆషియా కప్‌కి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాం.. అబ్బాయిలతో కాంపిటీటివ్ మ్యాచ్‌లు ఆడినప్పుడు మాపై చాలా ప్రెజర్ పడింది. పెద్ద పెద్ద టోర్నమెంట్లు వచ్చేసరికి ప్రెజర్‌ను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడమే మా మెయిన్ ప్రాబ్లమ్‌గా మారింది. కానీ ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌తో ద్వారా హై-ప్రెజర్ సిట్యుయేషన్స్‌లో ప్రశాంతంగా ఎలా ఉండాలో బాగా నేర్చుకున్నాం.. ఈ తేడా ఆషియా కప్ మ్యాచ్‌ల్లో ఖచ్చితంగా కనిపిస్తుందని సనా ధీమా వ్యక్తం చేసింది.
►ALSO READ | CSK ఓనర్‌షిప్ కావాలన్న ధోనీ: నో చెప్పిన చెన్నై మేనేజ్‌మెంట్.. CSKలో అసలేం జరుగుతోంది?
ఆషియా కప్‌లో కంబ్యాక్ చేసేనా?:
టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ మహిళల జట్టు పర్‌ఫార్మెన్స్ చాలా నిరాశాజనకంగా కొనసాగింది. ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం నెదర్లాండ్స్‌పై మాత్రమే గెలిచి, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ చేతుల్లో ఓడిపోయింది. భారత్, ఆస్ట్రేలియా లాంటి తోపు టీమ్‌ల ముందు ఘోరంగా తడబడింది. అయితే కెప్టెన్ ఫాతిమా సనా మాత్రం 11 వికెట్లు తీసి టోర్నీలోనే సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్‌గా నిలవడమే కాకుండా, సౌతాఫ్రికాపై 55 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. యూకేలో ది హండ్రెడ్ టోర్నీ ఆడిన అనుభవంతో ఇప్పుడు ఆషియా కప్‌లో జట్టును నడిపించేందుకు రెడీ అయింది.
సెప్టెంబర్ 5న భారత్ వర్సెస్ పాక్ హై-వోల్టేజ్ ఫైట్:
ఈ ఆషియా కప్‌లో పాకిస్థాన్ గ్రూప్-A లో టీమిండియా, థాయిలాండ్, హాంగ్‌కాంగ్‌లతో పోటీపడనుంది.
* సెప్టెంబర్ 1: థాయిలాండ్‌తో తొలి మ్యాచ్
* సెప్టెంబర్ 5: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ (మెగా హై-వోల్టేజ్ ఫైట్!)
* సెప్టెంబర్ 7: హాంగ్‌కాంగ్‌తో చివరి గ్రూప్ మ్యాచ్