
న్యూఢిల్లీ: మనదేశ కార్పొరేట్ సంస్థల కొనుగోళ్లు 2017 ఆర్థిక సంవత్సరం నుంచి రెండు రెట్లు పెరిగాయి. వీటిలో మూడింట ఒక వంతు ఒప్పందాలు మాత్రం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని దేశీయ రేటింగ్ఏజెన్సీ క్రిసిల్రిపోర్ట్ తెలిపింది. 20 రంగాలకు చెందిన రూ.500 కోట్లకు పైగా విలువైన 600 ఒప్పందాలను పరిశీలించి రిపోర్ట్తయారు చేశారు. దీని ప్రకారం.. ఫార్మా , హెల్త్‌కేర్, ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ, ఏఐ రంగాల కంపెనీలు సాంకేతికత, నైపుణ్యాలను పెంచుకోవడానికి ఇతర సంస్థలను కొంటున్నాయి.
సిమెంట్, మెటల్స్ రంగాల్లో నిర్మాణ సమయాన్ని తగ్గించుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. సుమారు 100 పెద్ద డెట్డీల్స్లో మూడింట రెండు వంతుల ఒప్పందాలు విజయవంతమయ్యాయి. సరైన అనుసంధానం లేకపోవడం, నియంత్రణపరమైన ఆలస్యాల వంటి సమస్యల కారణంగా కొన్ని ఒప్పందాలు దెబ్బతిన్నాయి.
వ్యూహాత్మక ఉద్దేశం మాత్రమే కాకుండా క్రమశిక్షణతో కూడిన అనుసంధానం, సరైన సమయానికి సమన్వయం సాధించడం చాలా ముఖ్యమని నివేదిక స్పష్టం చేసింది. కొనుగోళ్లు చేపట్టిన సుమారు మూడొంతుల కంపెనీల రేటింగ్స్ స్థిరంగా లేదా మెరుగ్గా ఉన్నాయి. 60 శాతం కంపెనీలు రెండేళ్లలోపు తమ అప్పులను విజయవంతంగా తగ్గించుకున్నాయని రిపోర్ట్ వెల్లడించింది.