
Wedding Gift: పెళ్లికి సాధారణంగా స్నేహితులు, బంధువులు కొత్త జంటకు బహుమతులు ఇస్తుంటారు. అయితే ఓ వ్యక్తి తన స్నేహితుడి పెళ్లికి ఇచ్చిన గిఫ్ట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. స్నేహితుడితో పాటు అతడి కొత్త భార్య ముఖాన్ని తన ఛాతిపై పర్మనెంట్ టాటూగా వేయించుకుని పెళ్లి వేడుకలో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. పెళ్లి వేడుకల్లో భాగంగా సదరు వ్యక్తి కొత్త జంటకు ఓ స్కెచ్‌ను బహుమతిగా ఇచ్చాడు. అందులో వరుడు, వధువు ఇద్దరి చిత్రాలు ఉన్నాయి. అయితే అది కేవలం స్కెచ్ మాత్రమే కాదని తర్వాత అతడు చేసిన పని చూసి అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. స్కెచ్‌ను కొత్త జంటకు ఇచ్చిన అనంతరం అతడు తన షర్ట్ విప్పి ఛాతిని చూపించాడు. అదే చిత్రాన్ని తన ఛాతిపై శాశ్వతంగా టాటూగా వేయించుకోవడం చూసి అక్కడివారంతా ఆశ్చర్యపోయారు. దీంతో వరుడి ముఖంలో ఒక్కసారిగా ఆశ్చర్యం, అయోమయం కలగలిసిన భావాలు కనిపించాయి. ప్రస్తుతం ఈ రియాక్షన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.
వీడియోపై స్పందించిన కొందరు.. స్నేహితుడి భావాలు నిజాయితీగా, ఆప్యాయతతో ఉన్నాయని కామెంట్స్ చేస్తుండగా.. అయితే తన భార్య ముఖం స్నేహితుడి ఛాతిపై శాశ్వతంగా టాటూగా కనిపించిన క్షణంలో వరుడి ముఖంలో వచ్చిన మార్పు మాత్రం చాలా ప్రశ్నలను రేకెత్తించిందని మరికొందరు కామెంట్లు చేశారు. అంతేకాకుండా ఈ ఘటనపై నెటిజన్ల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. కొందరు ఈ చర్యను స్నేహానికి ప్రతీకగా భావిస్తే.. మరికొందరు మాత్రం ఇది చాలా వ్యక్తిగతమైన, అసౌకర్యంగా అనిపించే చర్యగా అభివర్ణించారు.
ఓ నెటిజన్ స్పందిస్తూ.. సన్నిహిత స్నేహితుడి ముఖాన్ని టాటూగా వేయించుకోవడమే పెద్ద నిర్ణయమని, దానికి తోడు అతడి కొత్త భార్య ముఖాన్ని కూడా అదే టాటూలో శాశ్వతంగా వేయించుకోవడం నెక్స్ట్ లెవెల్ అంటూ పేర్కొన్నారు. మరో వ్యక్తి మాత్రం వరుడి రియాక్షన్ పైనే దృష్టి పెట్టి.. గిఫ్ట్ చూసిన మొదటి క్షణంలో వరుడు సంతోషించినట్లు కనిపించినప్పటికీ, టాటూలో తన భార్య ముఖం కూడా ఉన్నట్లు గుర్తించిన వెంటనే అతడి ముఖంలో అయోమయం స్పష్టంగా కనిపించిందని అభిప్రాయపడ్డాడు.
Friend tattooed his friend and his wife on his chest
The friend’s emotions might genuinely be pure and heartfelt, but look at the husband’s face the moment he sees his wife permanently tattooed on his friend’s chest.
Bro went from “aww, that’s wholesome” to “wait… why exactly… pic.twitter.com/mkSiDpKSgO
— Ritik (@ThenNowForeve) August 24, 2026