Reading Time: < 1 minute
Irumudi Movie Controversy Ap Teachers Federation Demands Removal Of Defamatory Scenes

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఇరుముడి’. గత శుక్రవారం విడుదలైనఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో ఓ వైపు థియేటర్స్ లో వసూళ్లు దంచి కొడుతోంది. అయితే మరోవైపు ఈ చిత్రం అనుకోని వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో ప్రభుత్వ పాఠశాలలను, ఉపాధ్యాయుల వ్యవస్థను తీవ్రంగా కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాజానికి మార్గదర్శకులుగా ఉండే ఉపాధ్యాయులను తక్కువ చేసి చూపించడం సరైన పద్ధతి కాదని సినిమాలో ఉన్న ఆ వివాదాస్పద దృశ్యాలను వెంటనే తొలగించాలని ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ సినిమాలో టీచర్ పాత్రను నేగెటివ్‌గా చిత్రీకరించారు. ముఖ్యంగా ఉపాధ్యాయురాలి పాత్ర కనిపించే సన్నివేశాల్లో రాష్ట్రంలోని ఒక ప్రభుత్వ పాఠశాల స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా అందులో నటించిన విద్యార్థులు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో అమలులో ఉన్న యూనిఫాంలనే ధరించడం అభ్యంతరంగా ఉంది. ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా ఉందనడంలో ఎలాంటి సందేహం లేధు. సమాజంలో పాఠశాలలకు, ఉపాధ్యాయులకు ఉన్న గౌరవాన్ని దెబ్బతీసే విధంగా దృశ్యాలను తెరకెక్కించడం సరైన పద్దతి కాదు. తక్షణమే స్పందించి ఆయా సన్నివేశాలను తొలగించకపోతే ఆందోళన కార్యక్రమాలను చేపడతాం. ఈ వ్యవహారంపై సెన్సార్ బోర్డుతో పాటు సంబంధిత అధికారులు కూడా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని’ డిమాండ్ చేశారు. మరి ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.