Reading Time: < 1 minute

కర్ణాటకలో పూర్తి వందే మాతరం ఉండదు: సీఎం డీకే శివకుమార్

Caption of Image.

వందేమాతర గీతం ఆలాపనపై కీలక వ్యాఖ్యలు చేశారు కర్ణాటక సీఎం డీకే శివకుమార్. కర్ణాటకలో ఇక పూర్థిస్థాయి వందేమాతర గీతం ఆలాపన ఉండదని 2026 ఆగస్టు 26న ప్రకటించారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్నే అనుసరించనున్నట్లు చెప్పారు.

వందేమాతరం లోని మొదటి రెండు చరణాలు మాత్రమే ఆలపించనున్నట్లు సీఎం డీకే శివకుమార్ తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మొత్తం ఆరు చరణాలు ఆలపించిన అంశాన్ని తోసిపుచ్చారు. ఆ నిర్ణయం తన ప్రమేయం లేకుండా తీసుకున్నారని తెలిపారు. 

పార్టీ సిద్ధాంతాల ప్రకారమే వెళ్లనున్నట్లు చెప్పారు డీకే. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానినే అమలు అనుసరిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వ కార్యక్రమంలోనైనా రెండు చరణాలు మాత్రమే పాడతామని పునరుద్ఘాటించారు. కర్ణాటకలో జరిగిన ఇండియా టుడే రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాక్యలు చేశారు. 

వందేమాతరం గీతం ఆలాపనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ.. 1937 రిజొల్యుషన్ ను ప్రస్తావిస్తూ.. రెండు స్టాంజాలే పాడనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వందే మాతరం పూర్తి గీతం పాడాలని కేంద్రం కొత్త బిల్లు తీసుకొచ్చిన వేళ కాంగ్రెస్ స్టాండ్ చర్చనీయాంశంగా మారింది. 

©️ VIL Media Pvt Ltd.