Reading Time: < 1 minute

ఐసీసీ టెస్ట్ నెంబర్ వన్ బౌలర్‎గా స్టార్క్.. 697 రోజుల తర్వాత టాప్ ప్లేస్ కోల్పోయిన బుమ్రా

Caption of Image.

దుబాయ్‌‌‌‌: ఆస్ట్రేలియా పేస్‌‌‌‌ బౌలర్ మిచెల్‌‌‌‌ స్టార్క్‌ తన కెరీర్‌‌‌‌లో తొలిసారి ఐసీసీ టెస్ట్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌లో నంబర్‌‌‌‌వన్‌‌‌‌ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌‌‌‌లో టీమిండియా సూపర్‌‌‌‌ స్టార్‌‌‌‌ జస్ప్రీత్‌‌‌‌ బుమ్రా (862) రెండో ర్యాంక్‌‌‌‌కు నెట్టి స్టార్క్‌‌‌‌ (872) టాప్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌ను సాధించాడు. ఇటీవల బంగ్లాదేశ్‌‌‌‌తో జరిగిన రెండో టెస్ట్‌‌‌‌లో స్టార్క్‌‌‌‌ మొత్తం 10 వికెట్లు తీసి ఆసీస్‌‌‌‌కు ఇన్నింగ్స్‌‌‌‌ 51 రన్స్‌‌‌‌ తేడాతో విజయాన్ని అందించాడు.

ఈ పెర్ఫామెన్స్‌‌‌‌తో స్టార్క్‌‌‌‌ ర్యాంకింగ్‌‌‌‌ గణనీయంగా మెరుగుపడింది. గాయం కారణంగా లంకతో సిరీస్‌‌‌‌కు దూరంగా ఉన్న బుమ్రా కెరీర్‌‌‌‌లో మొత్తంలో 697 రోజులు నంబర్‌‌‌‌వన్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌లో కొనసాగడం విశేషం. మ్యాట్‌‌‌‌ హెన్రీ (న్యూజిలాండ్‌‌‌‌, 861) ఒక్క ర్యాంక్‌‌‌‌ దిగజారి మూడో ప్లేస్‌‌‌‌లో నిలవగా, కమిన్స్‌‌‌‌ (841), మార్కో యాన్సెన్‌‌‌‌ (825) వరుసగా నాలుగు, ఐదు ర్యాంక్‌‌‌‌ల్లో ఉన్నారు.

టీమిండియా యంగ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ మానవ్‌‌‌‌ సుతార్‌‌‌‌ (450) కెరీర్‌‌‌‌ బెస్ట్‌‌‌‌ 48వ ర్యాంక్‌‌‌‌ను సాధించాడు. లంకతో జరిగిన తొలి టెస్ట్‌‌‌‌లో సుతార్‌‌‌‌ 10 వికెట్లు తీయడం ర్యాంక్‌‌‌‌ మెరుగుపడటానికి దోహదం చేసింది.  బ్యాటింగ్‌‌‌‌లో ఇండియా వికెట్‌‌‌‌ కీపర్‌‌‌‌ కమ్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ (711) ఆరు ర్యాంక్‌‌‌‌లు ఎగబాకి ఏడో ప్లేస్‌‌‌‌లో నిలిచాడు. శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (711), యశస్వి జైస్వాల్‌‌‌‌ (701) వరుసగా 8, 11వ ర్యాంక్‌‌‌‌ల్లో ఉన్నారు.

©️ VIL Media Pvt Ltd.