Reading Time: < 1 minute

రామగుండం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటాపోటీ

Caption of Image.

గోదావరిఖని, వెలుగు: ఖాళీగా ఉన్న రామగుండం కార్పొరేషన్​ఏరియా కాంగ్రెస్​అధ్యక్ష పదవికి పోటాపోటీ నెలకొంది. బుధవారం ఏఐసీసీ మెంబర్​, హిమాచల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన అబ్జర్వర్​ దీపక్​రాథోడ్, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్  చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫహీమ్​గోదావరిఖనిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సమావేశంలో అధ్యక్ష పదవి కోసం ఆశావహుల నుంచి నామినేషన్​ పత్రాలు స్వీకరించారు. 

కాగా కాంగ్రెస్​ పార్టీ అధ్యక్ష పదవి కోసం సీనియర్​ లీడర్లు, పలువురు కార్పొరేటర్లు పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కొనసాగిన పాతపెల్లి రవికుమార్​, కార్పొరేటర్లు ఎండీ ముస్తాఫా, నెలకంటి రాము, సీనియర్​ లీడర్లు కాల్వ లింగస్వామి, పెద్దెల్లి ప్రకాశ్​, తిప్పారపు శ్రీనివాస్​ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు  చేసుకున్నారు. 

©️ VIL Media Pvt Ltd.