బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ రోజుతోపాటు వచ్చే 2 రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈదురుగాలులతోపాటు.. ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. గ్యాంగెటిక్ పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్, ఉత్తర ఒడిశా ప్రాంతాలపై ఉన్న అల్పపీడనం ఈ రోజు, 25 ఆగస్టు 2026 ఉదయం 08:30 గంటల (IST) సమయానికి జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణ దిశగా వంగి ఉంది. ఈ వ్యవస్థ రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ఈరోజు జమ్ము, డెహ్రాడూన్, షాజహాన్‌పూర్, వారణాసి, జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న అల్పపీడన కేంద్రం, దిఘా మీదుగా ప్రయాణిస్తూ.. అక్కడి నుండి ఆగ్నేయ దిశగా వాయువ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది.
తెలంగాణ వాతావరణ సూచన (FORECAST)
మంగళవారం, బుధవారం తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గురువారం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్నిచోట్ల క్రింది స్థాయి గాలులు 30 నుండి 40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.
హెచ్చరికలు (WARNINGS)
ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, గంటకు 30 నుండి 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఏపీలో వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం ;-
మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్;-
మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
రాయలసీమ:-

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..