Reading Time: < 1 minute

రేపు (ఆగస్టు 26) స్కూళ్లకు సెలవు.. ఒక రోజు తర్వాత మళ్లీ సెలవు

Caption of Image.

ఆగస్టు నెలలో పిల్లల బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వరసగా పండుగలతో బాగా సెలవులు వచ్చాయి. బోనాలు, ఆగస్ట్ 15 హాలిడేస్ తీసుకున్న పిల్లలు.. ఇప్పుడు మళ్లీ సెలవులతో రిలాక్స్ కానున్నారు.

ఆగస్ట్ 26వ తేదీ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలకు సెలవు. ఎందుకంటే మిలాద్ ఉన్ నబీ పర్వదినం కావటం. ఆగస్ట్ 26వ తేదీ బుధవారం సెలవు అయినపోయిన తర్వాత.. 27వ తేదీ యధావిధిగా స్కూల్, కాలేజీలు ఉంటాయి.

ఆ తర్వాత రోజు అంటే ఆగస్ట్ 28వ తేదీ రాఖీ పౌర్ణమి.. ఆ రోజు స్కూల్, కాలేజీలకు సెలవు.. ఆ రోజు శుక్రవారం వచ్చింది. ఆగస్ట్ 29వ తేదీ శనివారం స్కూల్ కు వెళ్లగానే.. ఆ తర్వాత రోజు ఆదివారం.. ఆ రోజు హాలిడే.. మొత్తంగా రోజు మార్చి రోజు పిల్లలకు హాలిడేస్ వచ్చాయి ఈ వారంలో..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో  మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకుని  ఆగస్టు 26న స్కూళ్లు,కాలేజీలు,ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 26న అధికారికి సెలవుగా ప్రకటించింది. ముందుగా ఆగస్టు 25న సెలవు ఉంటుందని భావించిన విద్యార్థులు ఈ అప్ డేట్ ను గమనించాలని సూచించింది.  ఆగస్టు 28న ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. ఐటీ ఉద్యోగులకు శని,ఆదివారాలు కూడా కలిపితే లాంగ్ వీకెండ్ కలిసి రానుంది. 

©️ VIL Media Pvt Ltd.