
ప్రస్తుతం థియేటర్స్ లో ఇరుముడి సినిమాతో పాటు టాక్సిక్ సినిమా సందడి చేస్తుంది. ఇప్పటికే ఇరుముడి సినిమా బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో థియేటర్లన్నీ హౌస్ ఫుల్ బోర్డులతో కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు యష్ హీరోగా నటించిన టాక్సిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ రెండు సినిమాలు థియేటర్స్ లో దుమ్మురేపుతున్నాయి. అలాగే ఓటీటీల్లోనూ కొన్ని సినిమాలు కుమ్మేస్తున్నాయి. ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా సినిమాలు చేసే ఆడియన్స్ ను ఆకట్టుకునేలా వారానికి పదికి పైగా సినిమాలు ఓటీటీలోకి విడుదలవుతున్నాయి. అయితే ఓటీటీ లవర్స్ ను ఆకట్టుకునేలా ఎక్కువగా హారర్, రొమాంటిక్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ అవుతున్నాయి. ఆడియన్స్ కూడా అవే సినిమాలను ఇష్టపడుతున్నారు.
Jabardasth Naresh: మొదట్లో రూ.500 ఇచ్చారు.. ఇప్పుడు ఒకొక్క ఎపిసోడ్‌కు నాకు ఇచ్చేది ఎంతంటే
ఈ మధ్యకాలంలో మలయాళం సినిమాలు ఆడియన్స్ ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. వాటిలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువ.. అయితే ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస్ లు తెలుగులోనూ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సిరీస్ కూడా క్రైమ్ థ్రిల్లర్ జానర్. ఈ సిరీస్ లో డైలాగులు బూతులతో, సీన్స్ బోల్డ్ అండ్ వైలెన్స్ తో నిండి ఉంటాయి. ఒళ్లు జలదరించే కంటెంట్ తో వచ్చిన ఈ సిరీస్ ను ఓటీటీ ఆడియెన్స్ బాగానే ఆదరించారు. నిజంగా ఈ సిరీస్ చూడాలంటే దైర్యం ఉండాలి.
రూ. 65కోట్లు పెడితే.. రూ.10 కోట్లు కూడా రాలేదు.. డిజాస్టర్ దెబ్బకు హీరో రూపాయి కూడా తీసుకోలేదు
ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. ఒక ఊర్లో సావిత్రి అనే ఒక ఒంటరి మహిళ ఉంటుంది. మొగుడు లేకపోయినా, తన ముగ్గురు పిల్లల్ని కష్టపడి పెంచుతుంది ఆమె. అయితే అదే ఊరిలో ఉండే ఒక పోలీస్ సావిత్రితో పాటు ఆమె కూతురుపై కన్నేస్తాడు. రోజు వారిని వేధిస్తూ ఉంటాడు. అయితే ఆ పోలీస్ పెట్టే నరకం భరించలేక ఒకరోజు వాడిని సావిత్రి పెద్ద కొడుకు గొడ్డలితో అతన్ని నరికి చంపేస్తాడు. దాంతో కథ మరింత ఉత్కంఠగా మారుతుంది. ఆ తర్వాత ఊర్లో ఉండే చెడ్డ వ్యక్తులను చంపేస్తుంటాడు సావిత్రి పెద్ద కొడుకు. ఈ క్రమంలోనే పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిపోతాడు. అంతేకాదు సావిత్ర కుమారుడు అడవిలో ఉండే నక్సలైట్లతో కలిసి ప్రభుత్వంపైనే యుద్ధానికి దిగుతాడు.
ఆ హీరోలతో సినిమాలు చేయడం కష్టం.. నా వల్ల కాదు! ఓపెన్‌గా చెప్పేసిన తేజ
అయితే తనకు ఎవరూ ఎదురొచ్చినా అతను వారిని చంపుకుంటూ పోతాడు. చివరకు ఏమైంది.? సావిత్రి ఆమె ఫ్యామిలీ ఏమైంది? ఆమె కొడుకు పోలీసులకు దొరికాడా.? లేదా.? అనేది సిరీస్ లోనే చూడాలి. ఈ సిరీస్ పేరు షైతాన్ మహి వి రాఘవ్ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రిషి, షెల్లీ కిషోర్ , దేవయాని శర్మ, జాఫర్ సాదిక్, రవి కాలే ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ లో మొత్తం ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ లో బోల్డ్ సీన్స్, రక్తపాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే బూతు డైలాగులు కూడా ఎక్కువే ఉంటాయి. కాబట్టి ఒంటరిగా చూడటమే బెటర్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.