Reading Time: 2 minutes

JAM – 2027 నోటిఫికేషన్ వచ్చేసింది! డిగ్రీ అర్హతతో టాప్ ఐఐటీల్లో కాలేజీల్లో పీజీ చేసే ఛాన్స్..

Caption of Image.

దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఐఐఎస్​సీల్లో  మాస్టర్స్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష జామ్-–2027 (జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్– జేఏఎం) నోటిఫికేషన్ వెలువడింది.  జామ్-–2027 పరీక్షను ఖరగ్​పూర్ ఐఐటీ  నిర్వహిస్తోంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఐఐటీ, ఐఐఎస్​సీల్లో సుమారు 3,000కు పైగా పీజీ సీట్లను భర్తీ చేస్తారు. 

సబ్జెక్టులు: ఐఐటీ జామ్ పరీక్ష బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల (టెస్ట్ పేపర్లు)కు నిర్వహిస్తారు.  అభ్యర్థులు తమకు నచ్చిన లేదా డిగ్రీలో చదివిన అర్హతను బట్టి వీటిలో ఒకటి లేదా రెండు పేపర్లు (వేర్వేరు షిఫ్ట్​లో) రాసుకోవచ్చు.

విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ (బీఎస్సీ/ బీఏ/ బి.కాం/ బి.టెక్/ బీఈ) పూర్తిచేసి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  అభ్యర్థులు ఏ టెస్ట్ పేపర్ రాస్తున్నారో, దానికి సంబంధించిన నిర్దిష్ట సబ్జెక్టులను  డిగ్రీ స్థాయిలో చదివి ఉండాలి .

పరీక్షలో అర్హత సాధించిన తర్వాత ఐఐటీలు లేదా ఐఐఎస్​సీల్లో మాస్టర్స్ సీటు కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో మాత్రం కొన్ని సంస్థలు/ కోర్సులు కనీస మార్కులను ప్రామాణికంగా పరిగణించే అవకాశం ఉంది.  

వయసు: కనీస లేదా గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. ఏ వయసు వారైనా, ఎన్నిసార్లయినా ఈ పరీక్ష రాయవచ్చు.  

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 5.

లాస్ట్ డేట్: అక్టోబర్ 12. 

ఎగ్జామ్ డేట్: 2027, ఫిబ్రవరి 14. 

రిజల్ట్స్: 2027, మార్చి 18. 

ఎగ్జామ్ ప్యాటర్న్
ఆన్​లైన్ పద్ధతిలో నిర్వహించే ఎగ్జామ్​లో మూడు రకాల ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్–ఎలో మల్టిపుల్ చాయిస్, సెక్షన్–బిలో మల్టిపుల్ సెలెక్ట్ ప్రశ్నలు, సెక్షన్-–సిలో న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 60 ప్రశ్నలు ఇస్తారు. వాటికి 100 మార్కులు కేటాయించారు. 180 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ కేవలం ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియంలో మాత్రమే ఉంటుంది. 

సెక్షన్– ఎ
 ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 30 ప్రశ్నలు ఇస్తారు. 10 ప్రశ్నలకు 10 మార్కులు, 20 ప్రశ్నలకు 40 మార్కులు కేటాయించారు. మొత్తం 50 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉంటాయి. 1 మార్కు ప్రశ్నకు 1/3వ వంతు (-0.33), 2 మార్కుల ప్రశ్నకు 2/3వ వంతు (-0.66) మార్కులు కోత విధిస్తారు. 

సెక్షన్– బి
ఇందులో మల్టిపుల్ సెలెక్ట్ ప్రశ్నలు ఉంటాయి. అంటే ఇందులో ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు సరైనవిగా ఉండవచ్చు. మొత్తం 10 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది.  ఇందులో నెగెటివ్ మార్కింగ్ లేదు. అయితే, అభ్యర్థి అన్ని సరైన ఆప్షన్లను ఎంచుకుంటేనే పూర్తి మార్కులు వస్తాయి. అంటే పాక్షిక మార్కులు ఉండవు.

సెక్షన్– సి
న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. వీటికి ఎలాంటి ఆప్షన్లు ఉండవు. స్క్రీన్ పై కనిపించే వర్చువల్ కీప్యాడ్ ద్వారా సరైన సమాధానాన్ని (సంఖ్యను) టైప్ చేయాలి. మొత్తం 20 ప్రశ్నలు ఉంటాయి. ఒక మార్కు  ప్రశ్నలు 10, రెండు మార్కుల ప్రశ్నలు 10 చొప్పున ఇస్తారు. మొత్తం 30 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ లేదు. 

మరిన్ని వివరాలకు  వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్ jam.iitkgp.ac.in ను సందర్శించండి.
 

©️ VIL Media Pvt Ltd.