Reading Time: < 1 minute
Prince Cecil Marries Sai Prathima New Zealand Wedding Photos Viral

Tollywood Wedding: టాలీవుడ్ యువ నటుడు ప్రిన్స్ సిసిల్ ఓ ఇంటివాడయ్యారు. తన లాంగ్‌టైమ్ ప్రియురాలు సాయి ప్రతిమ (సాయి మాచిరాజు)ను ఈ రోజు (ఆగస్టు 24న) న్యూజిలాండ్‌లో తెలుగు సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రిన్స్ సిసిల్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ఆయన ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో డైరెక్టర్ తేజ దృష్టిలో పడ్డారు. అనంతరం 2012లో వచ్చిన ‘నీకు నాకు డ్యాష్ డ్యాష్’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అదే ఏడాది డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన ‘బస్ స్టాప్’ చిత్రంతో ప్రిన్స్ యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా యూత్‌లో ప్రిన్స్‌కు మంచి క్రేజ్ తీసుకొచ్చింది.

ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ప్రిన్స్ సిసిల్.. 2017లో ప్రసారమైన ‘బిగ్ బాస్ తెలుగు’ తొలి సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ఈ షో ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అనంతరం ‘డీజే టిల్లు’ సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. ఇక ఇప్పుడు తన లాంగ్‌టైమ్ ప్రియురాలు సాయి ప్రతిమతో వివాహ బంధంలోకి అడుగుపెట్టడంతో ప్రిన్స్ సిసిల్‌కు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. న్యూజిలాండ్‌లో జరిగిన ఈ సంప్రదాయ తెలుగు వివాహానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.