Reading Time: 2 minutes

Prince Cecil Wedding: న్యూజిలాండ్‌లో ఘనంగా ప్రిన్స్ పెళ్లి.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు!

Caption of Image.

టాలీవుడ్ ‘బస్ స్టాప్’ బాయ్, ‘డీజే టిల్లు’ ఫేమ్ ప్రిన్స్ సెసిల్ బ్యాచిలర్ లైఫ్‌కి శుభం కార్డ్ పడిపోయింది. తన సుదీర్ఘకాల ప్రేయసి సాయి ప్రతిమ వేలికి ఉంగరం తొడిగి,.. న్యూజిలాండ్‌లోని రమణీయమైన వనకా వేదికగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. విదేశీ గడ్డపై జరిగినప్పటికీ పక్కా తెలుగు సాంప్రదాయ పద్ధతిలో అతికొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. 

ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో ప్రిన్స్ ఐవరీ కలర్ కుర్తాలో రాయల్ లుక్‌లో కనిపించగా, వధువు సాయి ప్రతిమ బ్రైడల్ రెడ్ పట్టుచీర, మెరిసిపోయే సాంప్రదాయ ఆభరణాలలో మెరిసిపోయింది. వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు ఈ నవ దంపతులకు బెస్ట్ విషెస్ చెబుతున్నారు.

అయితే ఈ క్రేజీ లవ్ స్టోరీ వెనుక టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి హ్యాండ్ ఉందనే సీక్రెట్ బయటికొచ్చింది. ఒక కామన్ ఫ్రెండ్ మ్యారేజ్‌లో ప్రియదర్శి వీరిద్దరినీ పరిచయం చేయగా… ఆ హాయ్ బై కాస్తా డీప్ ఫ్రెండ్‌షిప్‌గా, ఆపై గాఢమైన ప్రేమగా మారింది. న్యూజిలాండ్‌లోనే పుట్టి పెరిగిన మాచిరాజు వెంకట రమేష్, లక్ష్మీ సుజాతల కుమార్తె అయిన ఎన్నారై సాయి ప్రతిమకు, గతేడాది జూన్‌లో లవ్లీగా ప్రపోజ్ చేసి నిశ్చితార్థం కూడా కానిచ్చేశాడు ప్రిన్స్.

తేజ దర్శకత్వంలో ‘నీకు నాకు డ్యాష్ డ్యాష్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్… ‘బస్ స్టాప్’తో యూత్‌ఫుల్ స్టార్‌గా మారాడు. ‘బిగ్ బాస్’ సీజన్-1లో తన జెన్యూన్ గేమ్‌తో ఆకట్టుకోవడమే కాకుండా ‘స్కంద’, ‘అశ్వథామ’, ‘డీజే టిల్లు’ చిత్రాల్లో డిఫరెంట్ రోల్స్‌తో మెప్పించాడు. సినిమాల్లో ఎన్నో మలుపులు చూసిన ప్రిన్స్.. తన రియల్ లైఫ్‌లో మాత్రం ప్రేమకథకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చేశారు.  

ఈ కొత్త జంటకు సినీ సెలబ్రిటీలు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలోనే హైదరాబాద్‌లో టాలీవుడ్ సెలేబ్స్ అందరి కోసం ఒక గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.  

 

©️ VIL Media Pvt Ltd.