Reading Time: < 1 minute

యాదాద్రి జిల్లా భువనగిరిలోని 31న డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్రూం ఇండ్ల గృహ ప్రవేశం

Caption of Image.

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా భువనగిరిలోని డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్రూం ఇండ్లలోకి ఈ నెల 31న లబ్ధిదారులు గృహ ప్రవేశం చేయనున్నారు. భువనగిరిలోని సింగన్నగూడెం వద్ద బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ హయాంలో 444 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేశారు. నిర్మాణాలు పూర్తయినా అప్పుడు పంపిణీ చేయలేదు. 2023  ఎన్నికల సమయంలో హడావుడిగా లబ్ధిదారులను ఎంపిక చేసి, పట్టాలు ఇచ్చారు.

కానీ మౌలిక వసతులు కల్పించకపోవడంతో గృహప్రవేశం చేయలేదు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇండ్లలో మౌలిక వసతులు కల్పించారు. ఇప్పటివరకు వాటిలో 120 ఇండ్లకు పూర్తి స్థాయి సౌకర్యాలు సమకూరాయి. సౌకర్యాలను సోమవారం అడిషనల్​ కలెక్టర్​ భాస్కరరావు పరిశీలించారు.

©️ VIL Media Pvt Ltd.