Reading Time: < 1 minute
Shiva Nirvana Reveals Ravi Teja Daughter Moksha Emotional Reaction To Irumudi Story

Irumudi: మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ విన్నప్పుడు రవితేజ కుమార్తె మోక్ష ఎలా స్పందించారో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా కథ చర్చల దశలో ఉన్నప్పుడు రవితేజ కుమార్తె మోక్ష స్వయంగా ఆఫీస్‌కు వచ్చి కథ విన్నారని శివ నిర్వాణ తెలిపారు. “మోక్ష మోడ్రన్ మైండ్‌సెట్ ఉన్న అమ్మాయి, కథ ఎలా రిసీవ్ చేసుకుంటుందో అనుకున్నాను. కానీ కథ నరేట్ చేస్తుంటే ఆమె తన తండ్రి రవితేజను ఆ పాత్రలో ఊహించుకుంటూ విన్నారు. సెకండ్ హాఫ్‌లోని ఒక కీలకమైన ఎమోషనల్ సీన్ వివరిస్తున్నప్పుడు ఆమె తట్టుకోలేకపోయారు. గొంతు పూడుకుపోయి, కళ్ల వెంట నీళ్లు పెట్టుకుని చేతులు పట్టుకుని ‘స్టాప్ ఇట్ సర్.. ఇది నేను థియేటర్‌లో చూడలేను’ అని ఏడ్చేశారు” అని శివ నిర్వాణ గుర్తుచేసుకున్నారు. ఎడిటింగ్ రూమ్‌లో కూడా ఆమె ఈ సినిమాను చూడలేదు. మొన్న చూసిందని తను అని చెప్పారు.

ఈ సినిమాలో రవితేజ హీరోయిజం కంటే పాత్రలోని నిజాయితీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని దర్శకుడు చెప్పారు. ఇంటర్వెల్ ముందు సాధారణ విలన్ చేతిలో రవితేజ దెబ్బలు తినే సన్నివేశం రాసినప్పుడు, ఫ్యాన్స్ ఏమైనా అనుకుంటారేమోనని ఆలోచించకుండా కథ కోసం ఆయన పూర్తిగా అంగీకరించారని తెలిపారు. అయ్యప్ప స్వామి భిక్ష సన్నివేశాల కోసం షర్ట్ విప్పేందుకు కూడా ఏమాత్రం వెనుకాడలేదని చెప్పారు. సినిమాకు మొదటి ఆడియన్లుగా మైత్రీ ప్రొడ్యూసర్ నవీన్ గారు, రవితేజ మేనేజర్ శ్రీనివాసరాజు కథ వింటూనే కన్నీళ్లు పెట్టుకున్నారని.. కథలోని ఆ బలమైన ఎమోషనే ఈరోజు ‘ఇరుముడి’ని ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టిందని శివ నిర్వాణ పేర్కొన్నారు.