Reading Time: 2 minutes

కృతి సనన్ vs కంగనా రనౌత్ వివాదం: రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

Caption of Image.

కృతి సనన్ నటతించిన  జ్యువెలరీ బ్రాండ్ రక్షాబంధన్ యాడ్ పై ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగుతోంది. సోషల్ మీడియాలో కృతికి మద్ధతుగా, వ్యతిరేకంగా కామెంట్స్ వస్తున్న సందర్భంలో.. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించడం ఆసక్తికరంగా మారింది. విమర్శలు  ఎదుర్కొంటున్న నటి కృతి సనన్‌కు  రాహుల్ మద్దతు తెలిపారు.

2026 ఆగస్టు 25న  తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో  కృతి సనన్ యాడ్ షేర్ చేసిన రాహుల్.. తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఒక మహిళ ఏమి ధరిస్తుంది, ఏమి చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది  ఆమె స్వేచ్ఛ. ఈ విషయంలో మహిళలను ట్రోల్ చేయడం మానండి అని పేర్కొన్నారు. మహిళల దుస్తులు, జీవనశైలి ఎంపికలపై ఆన్‌లైన్‌లో పోలీసింగ్ జరగకూడదని ఆయన సూచించారు.

ఈ వివాదం ఒక జ్యువెలరీ బ్రాండ్  ప్రకటనతో మొదలైంది. ఆ ప్రకటనలో కృతి  ఐవరీ బ్రాలెట్-స్కర్ట్ అవుట్‌ఫిట్‌తో కేప్ ధరించి రాఖీ కట్టుకున్నట్లు కనిపించారు. సోదరునికి రాఖీ కట్టిన తర్వాత పెంపుడు కుక్కకు కూడా రాఖీ కట్టిన దృశ్యం ఉంటుంది. దీనిపై కొందరు సోషల్ మీడియా యూజర్లు సాంప్రదాయ పండుగ సందర్భంగా ఇలాంటి బట్టలు వేసుకోవడమేంటని ప్రశ్నించారు. ఆ తర్వాత నటి, ఎంపీ కంగనా చేసిన కామెంట్స్ తో తీవ్ర వివాదంగా మారింది. 

కృతి కావాలనే అసహజంగా ఉండే బట్టలు వేసుకుందని.. రాఖీ కట్టేటప్పుడు బికినీ లాంటి అండర్ గార్మెంట్ బట్టలు వేసుకోవాల్సిన అవసరం ఏముందని కంగనా కామెంట్ చేయడంతో వివాదం మొదలైంది.  దీనిపై ఇప్పటికే కంగానకు కృతి కౌంటర్ ఇచ్చింది. 

తనపై వస్తున్న ట్రోలింగ్ పై ఇప్పటికే కృతి సనన్ ట్రోలింగ్‌కు కౌంటర్ ఇచ్చారు. సంస్కృతి, సంప్రదాయాలు హృదయంలో  ఉంటాయి.  నెక్‌లైన్‌లో కాదు! మహిళలకు ఏమి ధరించాలని చెప్పడం ఇంకా ఎప్పుడు మానుతాం?.. అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.  రక్షాబంధన్ అనేది సోదరుడితోనే కాకుండా.. తన సోదరితో కూడా అంతే బంధం ఉంటుందని.. తన సోదరి తను రాఖీ కట్టుకుంటామని తెలిపారు.   పెంపుడు జంతువులతో కూడా ఇలాంటి బంధం ఉందని వివరించారు.

©️ VIL Media Pvt Ltd.