Reading Time: < 1 minute
Peddi Vs Irumudi Irumudi Leads In Ticket Sales

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఇరుముడి బ్లాక్ బస్టర్ టాక్ తో భారీ వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తోంది. గతకొన్నేళ్ళుగా టాలీవుడ్ లో చూడనటువంటి హిట్ ఇప్పడు ఇరుముడి అందుకుంది. ఈ ఏడాది అత్యధిక ఫుట్ ఫాల్స్ రాబట్టిన సినిమాగా రామ్ చరణ్ ‘పెద్ది’ ఉంది. దాన్ని కూడా ఇప్పుడు రవితేజ ‘ఇరుముడి’ బద్దలు కొట్టింది. సినిమాల మొదటి ఆదివారం  థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల సంఖ్య  పరంగా ‘ఇరుముడి’ రికార్డ్ క్రియేట్ చేసింది.

ఆన్‌లైన్ ట్రాక్డ్ షోల ప్రకారం మొదటి ఆదివారం ‘పెద్ది’ చిత్రం 9.47 లక్షల టికెట్ల అమ్ముడయి టాప్ వన్ ప్లేస్ లో ఉండగా ‘ఇరుముడి’ దాదాపు 11 లక్షల టికెట్లతో ఆ రికార్డును బీట్ చేసింది.    సూపర్ కంటెంట్ కు తోడు మౌత్ టాక్ తోడవడంతో థియేటర్లలో ఇరుముడి చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. అయితే బాక్సాఫీస్ వసూళ్ల  విషయానికి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. 9.47 లక్షల టికెట్ల అమ్మకాలపై ‘పెద్ది’ ఏకంగా రూ. 20.50 కోట్లు సాధించగా 11 లక్షల టికెట్లు అమ్ముడైనప్పటికీ ‘ఇరుముడి’  రూ. 16.88 కోట్లకే పరిమితమైంది. ఎక్కువ మంది ఫుట్‌ఫాల్స్ ఉన్నప్పటికీ వసూళ్లలో ‘పెద్ది’ ముందంజలో ఉండటానికి కారణం రెండింటి సగటు టికెట్ ధరల్లో ఉన్న భారీ వ్యత్యాసమే. ‘పెద్ది’ చిత్ర సగటు టికెట్ ధర రూ. 216 కాగా, ‘ఇరుముడి’ సగటు టికెట్ ధర రూ. 153 గా ఉంది. తక్కువ టికెట్ ధరల వల్ల సాధారణ ప్రేక్షకులు, కుటుంబాలు ‘ఇరుముడి’ థియేటర్లకు అధిక సంఖ్యలో రాగా, ఎక్కువ టికెట్ ధరలతో ‘పెద్ది’ తక్కువ అడ్మిషన్లతోనే అత్యధిక గ్రాస్ సాధించి బాక్సాఫీస్ వద్ద పైచేయి సాధించింది.