Reading Time: < 1 minute
Gold Price Today In Hyderabad 24k Gold Rises Rs880 Silver Rs5000

Gold and Silver Prices Today: బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డిమాండ్‌ తదితర కారణాలతో పసిడి, వెండి ధరలు రోజురోజుకూ పైపైకి కదులుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల పెరుగుదల షాక్ ఇస్తోంది. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.880 వరకు పెరగగా, కిలో వెండి ధర ఏకంగా రూ.5,000 పెరిగింది.

హైదరాబాద్‌లో బంగారం ధరలు

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.16,397గా ఉంది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.880 పెరిగి రూ.1,63,970కు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.15,030గా ఉంది. 91.6 శాతం స్వచ్ఛత కలిగిన 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.800 పెరిగి రూ.1,50,300 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.12,293గా ఉంది. ఇది 75 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం.

ఢిల్లీలో బంగారం ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీ స్థాయిలో ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,64,120 వద్ద అమ్ముడవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,450 వద్ద ట్రేడ్ అవుతోంది.

వెండి ధరల్లోనూ భారీ పెరుగుదల

బంగారం మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,75,000కు చేరింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది. బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతుండటంతో నగలు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులపై అదనపు భారం పడుతోంది.