July 7, 2026

Tollywood : నాగార్జున, రవితేజతో బ్లాక్ బస్టర్ హిట్స్.. అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసిన హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

Tollywood : నాగార్జున, రవితేజతో బ్లాక్ బస్టర్ హిట్స్.. అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసిన హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Reading Time: 2 minutes
Tollywood : నాగార్జున, రవితేజతో బ్లాక్ బస్టర్ హిట్స్.. అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసిన హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? నిజానికి కాలం గడిచే కొద్దీ లేదా ఆరోగ్య సమస్యల వల్ల కొంతమంది నటీమణులు గుర్తుపట్టలేనంతగా మారిపోతారు. 2000వ దశకంలో ఆమె సౌత్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆమె ఎవరో గుర్తుపట్టరా.. ? తను మరెవరో కాదండి. హీరోయిన్ రక్షిత. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన అమ్మాయి. 2002లో పునీత్ రాజ్‌కుమార్ నటించిన కన్నడ చిత్రం ‘అప్పు’తో నటిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాథ్, మాస్ మాహరాజా రవితేజ కాంబోలో వచ్చిన ఇడియట్ చిత్రంలో నటించింది. ఈ సినిమాతో ఆమె కెరీర్ మారిపోయింది. దీంతో తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. నాగార్జున జోడిగా శివమణి చిత్రంలోనూ కనిపించారు. తెలుగు, కన్నడ, తమిళం భాషలలో రాణిచిన రక్షితకు అప్పట్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.

ఎక్కువ మంది చదివినవి : Athadu Movie : అతడు సినిమా హిట్ అవ్వడానికి కారణం ఆయనే.. నాజర్ కామెంట్స్..

ఆమె 2003లో సింబు నటించిన ‘ధామ్’ చిత్రంతో తమిళ చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేసింది. 2004లో విజయ్ హీరోగా నటించిన ‘మధుర’ చిత్రంలో నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 2007లో డైరెక్టర్ ప్రేమ్ ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె సినిమా రంగానికి దూరమైంది. 2014లో ఆమె బీజేపీలో చేరింది. 2022లో విడుదలైన కన్నడ చిత్రం ‘ఏక్ లవ్ యా’లో రక్షిత ప్రత్యేక పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఆమె సినిమాల్లో నటించలేదు. తాజాగా రక్షిత లేటేస్ట్ ఫోటోస్ వైరలవుతున్నాయి. బరువు పెరగడం వల్ల ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

ఎక్కువ మంది చదివినవి : Aamir Khan: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. ఆమీర్ ఖాన్ తన మొదటి ఇద్దరు భార్యలకు ఎందుకు విడాకులు ఇచ్చారో తెలుసా.. ?

రక్షిత ఫోటోలు చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు సౌత్ ఇండియన్ సినిమాను ఊపేసిన క్రేజీ హీరోయిన్ రక్షిత.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తెలుగులో తక్కువ కాలమే ఉన్నప్పటికీ ఎన్టీఆర్ సరసన ‘ఆంధ్రావాలా’, మహేష్ బాబుతో ‘నిజం’, నాగార్జునతో ‘శివమణి’, జగపతిబాబుతో ‘జగపతి’ వంటి పెద్ద సినిమాల్లో నటించారు. ఆమె భర్త ప్రేమ్ దర్శకత్వంలో వచ్చే సినిమాలకు రక్షిత నిర్మాతగా (రక్షిత ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై) వ్యవహరిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: అన్నయ్య నాకోసం ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. ఇప్పుడు ఇండస్ట్రీకే మొగుడయ్యాడు.. మురళి మోహన్..

రక్షిత ఫోటో..

Rakshitha Prem

Rakshitha Prem

ఎక్కువ మంది చదివినవి : Cinema: ఫస్ట్ సినిమా చూసి ప్లాప్ అన్నారు.. కట్ చేస్తే.. 26 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు..