వన్‌ప్లస్ నుంచి సంచలన ఫోన్..! ACE సిరీస్‌తో రికార్డులు క్రియేట్ అవుతాయా

గేమింగ్ ప్రియులకు, హెవీ యూజర్లకు ఇది నిజంగా గుడ్ న్యూస్. వన్‌ప్లస్ సంస్థ తన కొత్త ఏస్ 7 సిరీస్‌ను అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో రూపొందిస్తోంది. దాదాపు 9000mAh భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ మరియు యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. ప్రస్తుతం వన్‌ప్లస్ ఏస్ 7, ఏస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్లు ఇంజినీరింగ్ శాంపిల్ దశలో ఉన్నాయి. ఈ సిరీస్ ఈ ఏడాది నాలుగో త్రైమాసికం (Q4)లో చైనా మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
అద్భుతమైన డిస్‌ప్లే
ఏస్ 7 సిరీస్‌లో 6.78 అంగుళాల ఫ్లాట్ OLED ప్యానెల్‌ను అమర్చనున్నారు. ఇది 1.5K రిజల్యూషన్‌తో పాటు, ఏకంగా 185Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండటం విశేషం. ఇది గేమింగ్ మరియు స్క్రోలింగ్ అనుభవాన్ని అత్యంత స్మూత్‌గా మారుస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ (SM8850)ను వాడబోతున్నారు. ప్రో వేరియంట్‌లో మరింత శక్తివంతమైన చిప్‌సెట్ మరియు యాక్టివ్ ఫ్యాన్ కూలింగ్ సిస్టమ్ ఉండటం వల్ల ఫోన్ వేడెక్కకుండా పర్ఫార్మెన్స్ స్థిరంగా ఉంటుంది.
బ్యాటరీ, కెమెరా విభాగం
ఈ ఫోన్ల అతిపెద్ద హైలైట్ బ్యాటరీ సామర్థ్యం. 9000mAh నుంచి 10,000mAh వరకు ఉండే భారీ బ్యాటరీని ఇవ్వబోతున్నట్లు లీకులు చెబుతున్నాయి. దీనికి తోడు 100W లేదా 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో బ్యాటరీ ఛార్జింగ్ సమస్య ఉండదు. కెమెరా పరంగా చూస్తే, ప్రో మోడల్‌లో 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (Samsung JN5 సెన్సార్) మరియు 3.5x ఆప్టికల్ జూమ్ అందించనున్నారు.
ఈ స్పెసిఫికేషన్లు గనుక నిజమైతే, వన్‌ప్లస్ ఏస్ 7 సిరీస్ మిడ్‌రేంజ్ మరియు ఫ్లాగ్‌షిప్ విభాగాల్లో సరికొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేయడం ఖాయం. వన్‌ప్లస్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే, అయితే ఇప్పటికే ఈ ఫోన్లపై ఉన్న అంచనాలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. మీ కంటెంట్ క్రియేషన్, గేమింగ్ అవసరాలకు ఇది పక్కాగా సరిపోతుంది.