Reading Time: < 1 minute
Satyadev On Nude Scene In Rao Bahadur Movie

టాలీవుడ్‌లో విలక్షణ నటనతో మంచి పేరు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఇటీవల ఆయన హీరోగా, వెంకటేష్ మహా దర్శకత్వంలో ‘రావు బహదూర్’ అనే సినిమా రూపొందింది. జూలై మూడో తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా, ప్రేక్షకులతో పాటు సినీ విశ్లేషకుల నుంచి, విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందుతోంది.

ఇక ఈ సినిమాలో ఒక సీన్ లో తాను నగ్నంగా నటించాలని అనుకున్నట్లుగా సత్యదేవ్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ఒక సీన్ లో తనని నగ్నంగా నటించాల్సిందిగా దర్శకుడు వెంకటేష్ మహా కోరాడని, అయితే అప్పటికప్పుడు తనకు ఆలోచించుకునే సమయం అడిగానని చెప్పుకొచ్చారు. తర్వాత కొంత సంఘర్షణ తర్వాత, తక్కువ మంది క్రూతో ఎలా షూట్ చేయాలో అనే విషయం కూడా ఆలోచించామని, బాడీ కాన్ డ్రెస్ వేసుకొని నటించాలని భావించినట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే ఆ పాత్ర కోసం కాస్త పొట్ట ఉన్నట్లుగా చూపించాల్సిన పరిస్థితుల్లో ఆ బాడీకాన్ డ్రెస్ సెట్ అవ్వకపోవడంతో, ఆ నగ్నంగా నటించాలనుకున్న ఆలోచనను పక్కన పెట్టినట్లుగా సత్యదేవ్ చెప్పుకొచ్చాడు.

జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద మహేష్ బాబు సమర్పకుడిగా, శరత్ అనురాగ్ రెడ్డితో పాటు చింతా గోపాలకృష్ణారెడ్డి సహ నిర్మాణంలో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో దీపా థామస్ సత్యదేవ్ సరసన హీరోయిన్గా నటించింది…