July 7, 2026

IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..

IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
Reading Time: < 1 minute
Ind Vs Eng 3rd T20i Toss Report India Bowl First Playing Xi Changes

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ (Ind vs Eng) మధ్య ట్రెంట్ బ్రిడ్జ్ (నాటింగ్‌హామ్) వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదటగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు మొదటగా బ్యాటింగ్‌కు దిగనుంది. గత మ్యాచ్‌లో ఇండియా ఓటమిని చవిచూసినప్పటికీ, భారత ఆటగాళ్లు మంచి జోష్‌లో ఉన్నారని, పిచ్.. చిన్న బౌండరీలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెప్టెన్ అయ్యర్ తెలిపాడు.

ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో (Playing XI) ఒక మార్పు చేశారు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్‌కు జట్టులో చోటు కల్పించారు. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. సిరీస్‌లో ఇంగ్లాండ్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉండటంతో, ఈ మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యాన్ని 2-0కు పెంచుకోవాలని పట్టుదలగా ఉంది. శ్రేయస్ అయ్యర్ వరుసగా ఐదోసారి టాస్ గెలవడం విశేషం.

భారత జట్టు (India):

అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శివమ్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

ఇంగ్లాండ్ జట్టు (England):

ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్.