Reading Time: < 1 minute

131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై లోక్ సభలో ఓటింగ్.. అనుకూలంగా 207 ఓట్లు.. వ్యతిరేకంగా 126 ఓట్లు

Caption of Image.

ఢిల్లీ: లోక్ సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చకు అనుకూలంగా 207 ఓట్లు, వ్యతిరేకంగా 126 ఓట్లు రావడంతో చర్చకు లైన్ క్లియర్ అయింది. ఈ ఓటింగ్ జరిగిన సమయంలో సభలో మొత్తం 333 మంది సభ్యులు ఉన్నారు. ఈ బిల్లును కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సమాజ్ వాదీ పార్టీ, ఎంఐఎం, ఆర్ఎస్పీ, సీపీఎం వ్యతిరేకించాయి. సభలో మెజారిటీ సభ్యులు బిల్లు ప్రవేశపెట్టడంపై అనుకూలంగా ఓట్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుపై చర్చించేందుకు అనుమతి లభించినట్లయింది.

బిల్లుల్లోని ముఖ్యాంశాలు
* నియోజకవర్గాలను పునర్విభజన చేసేందుకు ఈ బిల్లు 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రతిపాదించింది.

* రాజ్యాంగంలోని ఆర్టికల్ 81ని సవరించడం ద్వారా లోక్‌‌‌‌సభలో రాష్ట్రాల నుంచి ఎన్నుకొనే సభ్యుల సంఖ్యను గరిష్టంగా 815కి, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకొనే వారి సంఖ్యను 35కి పెంచనున్నారు.

* 2023 మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వేగంగా అమలు చేయడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. తదుపరి జన గణన,  ఆ తర్వాత జరిగే పునర్విభజన ప్రక్రియకు చాలా సమయం పడుతుంది కాబట్టి, ఇప్పటికే అందుబాటులో ఉన్న జనాభా లెక్కల (2011) ఆధారంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

* 2029 ఎన్నికలనుంచే మహిళలకు 33% రిజర్వేషన్లను అమలు చేయనున్నారు.

* ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరిలాంటి శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా వర్తించేలా ప్రత్యేక బిల్లులను ప్రభుత్వం తీసుకురానున్నది.

©️ VIL Media Pvt Ltd.