Reading Time: < 1 minute
Israel Rejects Trump Gaza Peace Plan Hamas Disarmament Netanyahu

Israel: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ‘‘గాజా శాంతి ప్రణాళిక’’ ను ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తిరస్కరించారు. ఆయన గాజా లేదా వెస్ట్ బ్యాంక్‌తో పాలస్తీనా దేశం ఏర్పాటును తోసిపుచ్చారు. 15-అంశాల గాజా పీస్ ప్లాన్‌ను ఆదివారం తిరస్కరించారు. ట్రంపునకు ఇది ఎదురుదెబ్బగా మారింది. ‘‘నేను ప్రధానిగా ఉన్నంత కాలం, పాలస్తీనా దేశం ఉండదు’’ అని నెతన్యాహూ అన్నట్లు ఇజ్రాయిల్ మీడియా నివేదించింది.

గాజా ప్లాన్‌ను తిరస్కరించడంతో పాటు హమాస్ పూర్తిగా నిరాయుధమయ్యే వరకు ఇజ్రాయిల్ గాజా నుంచి వెళ్లేదే లేదని తేల్చి చెప్పారు. ఈ రోడ్ మ్యాప్‌ను ట్రంప్ ‘‘కీలక మైలురాయి’’, ‘‘గొప్ప పురోగతి’’గా అభివర్ణించిన వారం రోజుల తర్వాత నెతన్యాహూ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఇదిలా ఉంటే, ఈ ప్రణాళికకు హమాస్ అంగీకరించింది. శాంతి ప్రణాళిక అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తీసుకురావాలని హమాస్ కోరింది. ఈ ప్రణాళికలో భాగంగా తదుపరి దశకు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ ‘బోర్డ్ ఆఫ్ పీస్’కు హమాస్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు, ఇజ్రాయిల్ తీరుపై ముస్లిం దేశాలు విమర్శలు చేస్తున్నాయి. వారం రోజుల క్రితం యూఏఈతో పాటు ఏడు ముస్లిం దేశాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయిల్ సైనిక చర్యను తీవ్రంగా విమర్శించాయి. ఇజ్రాయిల్ చర్యలు గాజా యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ రూపొందించిన శాంతి ప్రణాళికకు విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి.