Reading Time: < 1 minute
Medico Priyanka: మృత్యువుతో పోరాడుతూ కన్నుమూసిన రాజమండ్రి మెడికో ప్రియాంక..

రాజమండ్రి మెడికో ప్రియాంక మృత్యువుతో పోరాడుతూ కన్నుమూసింది. సికింద్రాబాద్‌లో కిమ్స్‌లో చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందింది. ప్రియాంక బ్రెయిన్‌ డెడ్‌ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. మ.3:22కి మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఇద్దరు వ్యక్తులు ఆగస్టు 3న మద్యంమత్తులో ప్రియాంకను కారుతో ఢీకొట్టారు.. అప్పటినుంచి ప్రియాంక తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది.

తాగుబోతుల పైశాచికత్వానికి రాజమండ్రిలో గాయపడినప్పటి నుంచి మెడికో ప్రియాంక పరిస్థితి అత్యంత విషమంగానే ఉంది. రాజమండ్రిలో చికిత్స అనంతరం.. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి ఆమెను తరలించారు. అప్పటినుంచి ఆమెకు డాక్టర్లు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రియాంకకు ఇప్పటికే అప్నియా టెస్ట్ చేయాలని వైద్యులు ప్రయత్నించినా, అందుకు ఆమె శరీరం సహకరించలేదని పేర్కొంటున్నారు. శరీరంలో సోడియం లెవల్స్‌ 16కన్నా తక్కువగా ఉండటం వల్లే ఇది సాద్యం కాలేదన్నారు. ఆమెను ఎలాగైనా కాపాడానికి డాక్టర్లు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ.. చివరకు ప్రియాంక బ్రెయిన్‌డెడ్‌ తో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.