
ప్రేమ వివాహం చేసుకున్నాడు.. ఆ తర్వాత మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.. అంతా బాగానే ఉందనుకున్న క్రమంలో ఈ విషయం భార్యతోపాటు.. అత్త వారింట్లో తెలిసింది.. అల్లుడు మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిసి ఆ అత్త నిలదీసింది.. ప్రేమ వివాహం చేసుకున్న తన కూతురు కాపురం బాగుండాలని అల్లుడ్ని హెచ్చరించింది. కానీ అతడిలో ఎంతకీ మార్పు రాకపోవడంతో గ్రామ పెద్దల ముందు దోషిగా నిలబెట్టింది. అల్లుడు తీరులో మార్పు రాకపోవడంతో భార్య, అత్త గట్టిగా నిలదీయడంతో గొడవ పడ్డాడు. అత్తను అడ్డు తొలగించుకోవాలని అల్లుడు ప్లాన్ వేశాడు.. ఆమెను ఇంట్లోనే హత్య చేసి ఊరి శివారులో పెట్రోల్ పోసి తగలబెట్టాడు. అల్లుడు, ఆమె ప్రియురాలు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు ..
సత్తుపల్లి మండలం తుంబూరులో వృద్ధురాలు వెంకట నరసమ్మ మిస్సింగ్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అత్త అడ్డు వస్తుందని.. అల్లుడు తిరుపతి రావు ఆమెను ఇంట్లోనే హత్య చేసి ఊరి శివారులో పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ కేసులో తిరుపతి రావు, అతని ప్రియురాలు సునీత ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామానికి చెందిన వెదుల్ల తిరుపతిరావుకు అదే గ్రామానికి చెందిన గుండాల వెంకట నరసమ్మ పెద్ద కుమార్తె మంగమ్మతో 30 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. కరెంటు పని చేసుకుంటూ జీవన సాగించే తిరుపతి రాకు గతంలోనే ఓ మహిళతో వివాహం జరిగింది. ఈ క్రమంలో తిరుపతిరావు కొద్ది రోజులు తుంబురులోనే ఉంటూ ఇదే సమయంలో మరో వివాహిత మహిళ సునీత తోనూ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
ఈ విషయం భార్య మంగమ్మ ,ఆమె తల్లి వెంకట నరసమ్మ తెలిసి తరచూ గొడవలు జరిగేవి.. వారిని మందలించినా అల్లుడు తీరు లో మార్పు లేకపోవడంతో పెద్ద మనుషులు సమక్షంలో పంచాయతీ పెట్టింది. అల్లుడు తీరు పై అత్త హెచ్చరిస్తూ.. తన కూతురికి అన్యాయం చేస్తూ.. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఏంటని నిలదీసింది.. భార్య మంగమ్మ కూడా తనకు భర్త వద్దని స్పష్టం చేస్తూ విడిగా ఉంటోంది. ఈ పంచాయితీ జరిగిన రెండు రోజులు తర్వాత ఆగస్టు 2 రాత్రి నుంచి అత్త వెంకట నరసమ్మ కనిపించకుండా పోయింది. దీంతో తన తల్లి కనిపించడం లేదని.. 3వ తేదీన సత్తుపల్లి పీఎస్ లో కూతురు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తమ వివాహేతర సంబంధం కొనసాగాలంటే అత్తను అడ్డు తొలగించుకోవాలని అల్లుడు తిరుపతి రావు, అతని ప్రియురాలు సునీత ఇద్దరూ కలిసి ఈ నెల 2 తేదీన రాత్రి 12 గంటలకు అత్త ఇంటికి వెళ్లి టీవీ చూస్తున్న ఆమెను చీర కొంగు బిగించి హత్య చేశారు. ఆ తర్వాత అత్త శవాన్ని తిరుపతి రావు, సునీత బైక్ పై పెట్టుకొని నారాయణపురం గుడి దాటిన తర్వాత రోడ్డు పక్కన ఉన్న ఎండిపోయిన కట్టెలు కొబ్బరి మట్టలు శవం పై వేసి పెట్రోల్ బాటిల్ తీసి తగలబెట్టారు ఆ తర్వాత రోజు ఉదయం వెళ్లి చూడగా ఆ శవం పూర్తిగా కాలకుండా ఉందని గమనించి ..మళ్లీ ఆ శవం పై కొబ్బరి మట్టలో చెత్త వేసి తగలబెట్టారు. మూడో తేదీ రాత్రి 11 గంటల సమయంలో శవం కాలకుండా కొన్ని శరీర భాగాలు మిగిలి ఉండటంతో వాటిని ఆకుపచ్చ గుడ్డ మ్యాట్ లో వేసుకొని కొంచెం దూరం వెళ్లి అక్కడ రోడ్డు పక్కన కొబ్బరి మట్టలు, చెత్తలో వేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ తర్వాత ఏమి తెలియనట్లు నటించి కుటుంబ సభ్యులతో తిరిగాడు.. పోలీసులు ఆధారాలు సేకరించి, తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయట పడింది. అల్లుడు తిరుపతి రావు, అతని ప్రియురాలు సునీత ఇద్దరి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సత్తుపల్లి పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..