Reading Time: < 1 minute

రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి… మృత్యువుతో ఐదు రోజులు పోరాడి..

Caption of Image.

ఇటీవల రాజమండ్రిలో కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మహిళా డాక్టర్ ప్రియాంక మృతి చెందారు.సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు డాక్టర్లు. ఆదివారం ( ఆగస్టు 9 ) ప్రియాంక ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు ప్రకటించిన డాక్టర్లు కాసేపటికే ఆమె మృతి చెందినట్లు నిర్దారించారు.

ఆగస్టు 3న రాజమండ్రిలోని ప్రసాదిత్యమాల్ లో పార్కింగ్ విషయంలో గొడవ కారణంగా ప్రియాంకను కారుతో అమానుషంగా ఢికొట్టారు నిందితులు. ఈ ప్రమాదంలో కారు ప్రియాంక తలపై ఎక్కడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఘటన జరిగిన సమయంలో నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.

►ALSO READ | భర్తను చంపేసి.. సిలిండర్ పేలిన ఘటనగా చిత్రీకరించిన భార్య.. నిర్మల్ జిల్లా హత్య కేసును ఛేదించిన పోలీసులు

మెరుగైన చికిత్స కోసం ప్రియాంకను హైదరాబాద్ కు తరలించారు కుటుంబసభ్యులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు రాజమండ్రికి చెందిన దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ లను అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా వారికీ 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.

©️ VIL Media Pvt Ltd.