
హైదరాబాద్: తెలుగు ఫిలిం & టీవీ డాన్సర్స్ & డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడించారు. మొత్తం 502 ఓట్లలో 114 ఓట్లు పోలవగా, వాటిలో 2 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. ఈ ఎన్నికల్లో కొన్ని పదవులు ఏకగ్రీవంగా నిర్ణయించబడ్డాయి. ఉపాధ్యక్షులుగా G. శంకర్ (కార్డు నెం. 53), జాయింట్ సెక్రటరీగా P. నాగ మల్లేశ్వర్ రావు (కార్డు నెం. 481), ఆర్గనైజింగ్ సెక్రటరీగా G. రవితేజ (బన్ని) (కార్డు నెం. 481) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా P. కన్నయ్య (కార్డు నెం. 177), M. రమేష్ (చరణ్) (కార్డు నెం. 500), M. రాములు (కార్డు నెం. 531), B. వెంకన్న (కార్డు నెం. 415) ఏకగ్రీవంగా ఎంపిక కావడం గమనార్హం.
ప్రధాన కార్యదర్శి పదవికి జరిగిన పోటీలో G. బాలకృష్ణ (బాలు. G) (కార్డు నెం. 426) 68 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి B. శ్రీనివాస్ గౌడ్కు (లడ్డు శ్రీను) (కార్డు నెం. 77) 23 ఓట్లు దక్కాయి. కోశాధికారి పదవికి జరిగిన ఎన్నికల్లో P. ఇశ్రాయేలు (తడివేలు) (కార్డు నెం. 212) 79 ఓట్లు సాధించి, 34 ఓట్లు పొందిన G. వీరస్వామిపై 45 ఓట్ల తేడాతో గెలిచారు.
►ALSO READ | Allu Arjun: AAA సినిమాస్ ఓపెనింగ్‌లో హైలైట్ ఇదే.. అభిమానుల మనసు గెలిచిన అల్లు అర్జున్
మహిళా కమిటీ సభ్యుల విభాగంలో K. నిరంజని (కార్డు నెం. 234) 79 ఓట్లు, CH. సాయి లక్ష్మి (కార్డు నెం. 325) 65 ఓట్లు సాధించి విజేతలుగా నిలిచారు. T. శ్రావణ సంధ్య (కార్డు నెం. 389) 59 ఓట్లు పొందారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలను కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ (పదవీ విరమణ పొందిన) మరియు న్యాయ సలహాదారు వి. సామ్రాట్ అశోక్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. చిరంజీవి, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ ఉప ఎన్నికలు వద్దని చెప్పినా జానీ మాస్టర్ భార్య, ప్రెసిడెంట్ సుమలత వినిపించుకోలేదు. 600 సభ్యులు ఉన్న అసోసియేషన్లో 502 మందికి ఓటు హక్కు కేవలం 116 మంది మాత్రమే పాల్గొన్నారు.
ఉప ఎన్నికలకు దూరంగా ఉన్న శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, బాను మాస్టర్ డాన్సర్స్. మూడొంతుల మంది డాన్సర్స్ ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉన్నారు. అసోసియేషన్ డాన్సర్స్ ఫెడరేషన్ కౌన్సిల్కి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.