
జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంతో బైక్ డివైడర్ ను ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ( ఆగస్టు 9 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల పట్టణంలోని బైపాస్ లో రోడ్డులో జరిగింది ఈ ప్రమాదం. ఓవర్ స్పీడ్ తో వస్తున్న బైక్ మూలమలుపు దగ్గర డివైడర్ ను ఢీకొట్టింది.
పెగడపల్లి మండలం ఢీకొండ గ్రామానికి చెందిన గంగాధర్ తన తాతతో కలిసి బైక్ పై వెళ్తుండగా ఘటన జరిగింది. ఈ ఘటనలో గంగాధర్ అక్కడికక్కడే మృతి చెందగా…తాతకు తీవ్ర గాయాలయ్యాయి.
►ALSO READ | యాదాద్రి భువనగిరిలో షాకింగ్ ఘటన.. రూ.54 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
తాతను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గంగాధర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
గంగాధర్ జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. గంగాధర్ తల్లిదండ్రులు గతంలో అనారోగ్యంతో మృతి చెందగా.. ఇప్పుడు గంగాధర్ యాక్సిడెంట్ లో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.