
స్కూళ్ళు, కాలేజీలు మొదలయ్యాయి..పొద్దున్నే లేచింది మొదలు ఉరుకులు పరుగులు మొదలు. పెద్దలు ఆఫీసులకు వెళ్లే హడావిడి.. పిల్లలు స్కూళ్లకు వెళ్లే హైరానా వెరసి యాంత్రికమైపోయింది జీవితం అనే ఫీల్ లో ఉన్నారు జనం. సరిగ్గా ఇలాంటి టైంలోనే వచ్చింది లాంగ్ వీకెండ్. ఇంకేముంది ట్రిప్స్ కి ప్లాన్ చేశారు జనం. దీంతో ఆదివారం ( ఆగస్టు 9 ) శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
లాంగ్ వీకెండ్ కావడంతో శ్రీశైల మల్లన్న ఆలయానికి పోటెత్తారు భక్తులు. భారీగా భక్తులు తరలిరావడంతో శ్రీశైలం రహదారుల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. టోల్ గేట్ నుంచి ఆలయ ముఖద్వారం వరకు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.
►ALSO READ | రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి… మృత్యువుతో ఐదు రోజులు పోరాడి..
కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోవడంతో భక్తుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతోంది. వరుణయాగం సందర్భంగా ఇవాళ,రేపు ఆర్జిత సేవలు స్పర్శ దర్శనాలు నిలిపేసిన సంగతి తెలిసిందే.