Reading Time: 2 minutes

ఆ మూడు దేశాలకే సాధ్యమైన టెక్నాలజీ.. ఇప్పుడు ఇండియాకు సొంతం.. FFSC రాకెట్ ఇంజిన్ ప్రాముఖ్యత ఏంటి..?

Caption of Image.

అమెరికా, రష్యా, చైనా వంటి అగ్ర దేశాల దగ్గర ఉన్న టెక్నాలజీ ఇండియాకు సొంతమైంది. అంతరిక్ష పరిశోధనల్లో కీలకంగా పనిచేసే సాంకేతికతనుసాధించడంతో  ప్రపంచ దేశాలు ఇండియా వైపు చూస్తున్న  సందర్భం.  బెంగళూరుకు చెందిన ఒక ప్రైవేటు సంస్థ FFSC రాకెట్ ఇంజిన్ ను ఆవిష్కరించింది. ప్రపంచంలో ఎన్నో దేశాలకు సాధ్యం కాని ఈ ఇంజిన్ ఇండియా తయారు చేయడంతో.. ఏంటి ఆ ఇంజిన్ ప్రాముఖ్యత అనే చర్చ మొదలైంది. దీని గురించి తెలుసుకుందాం.

FFSC – Full-Flow Staged Combustion..  ఇంజిన్ అనేది రాకెట్ టెక్నాలజీలో ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన, అత్యధిక ఇంధన సామర్థ్యం గల ద్రవ ఇంధన రాకెట్ ఇంజిన్ డిజైన్. ఇటీవలే, బెంగళూరుకు చెందిన  ఆస్ట్రోబేస్ స్పేస్ టెక్నాలజీస్ అనే స్టార్టప్ సంస్థ తయారు చేసింది. ఎవరెస్ట్  పేరు కలిగిన ఈ స్టార్టప్.. ఇండియాలో  మొట్టమొదటి ప్రైవేట్ 800 kN FFSC రాకెట్ ఇంజిన్‌ను ఆవిష్కరించింది. దీంతో రష్యా, అమెరికా, చైనాల తర్వాత ఈ క్లిష్టమైన సాంకేతికతను సాధించిన నాల్గవ దేశంగా ఇండియా నిలిచింది. 
 
టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?

సాధారణ రాకెట్ ఇంజిన్లలో, టర్బోపంపులను నడపడానికి కొంత ఇంధనాన్ని లేదా ఆక్సిడైజర్‌ను మండించేందుకు వాడతారు. దాన్ని తర్వాత వ్యర్థంగా బయటకు వదిలేస్తారు. అది వృధా అయినట్లే. కానీ FFSC ఇంజిన్‌లో ఇంధన వృధా అస్సలు ఉండదు. 

►ALSO READ | బెంగాల్లో రచ్చ రచ్చ.. మాజీ సీఎం మమతా బెనర్జీ కారుపై ఇటుకలు, బండరాళ్లతో దాడి
 
 ఇందులో ఇంధనం కోసం ఒకటి, ఆక్సిడైజర్ కోసం మరొకటి విడివిడిగా రెండు ప్రీ-బర్నర్లు ఉంటాయి.  రాకెట్ ఉపయోగించే ఇంధనం- మీథేన్, ఆక్సిడైజర్ (ద్రవ ఆక్సిజన్) 100 శాతం   వాయువులుగా మారిన తర్వాతే మెయిన్ కంబషన్ ఛాంబర్ లోకి ప్రవేశిస్తాయి. 

దీనివల్ల ఇంజిన్ లోపల 300 బార్ కంటే ఎక్కువ ఒత్తిడి నిరంతరాయంగా ఉంటూ, రాకెట్‌కు గరిష్ఠ వేగాన్ని, శక్తిని   ఇస్తుంది. 
 
ఎవరెస్ట్ ఇంజిన్ విశేషాలు:

ఇంధనం: లిక్విడ్ ఆక్సిజన్ + లిక్విడ్ మీథేన్.. దీనిని మెథాలాక్స్ – మెథాలాక్స్  అంటారు. 800 కిలోన్యూటన్లు (Vacuum Thrust / 80-టన్నుల క్లాస్ 
శక్తి ఉంటుంది.  50 శాతం నుంచి 110 శాతం వరకు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. 

తయారీ విధానం: ఇండియా అతిపెద్ద ఇండస్ట్రియల్ 3D ప్రింటర్ సాయంతో దీని విడిభాగాలను తయారు చేశారు.  ఈ ఇంజిన్‌ను దాదాపు 50 సార్లకు పైగా తిరిగి ఉపయోగించుకోవచ్చు. 

దీని ప్రాధాన్యత ఏమిటి?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా FFSC ఇంజిన్  అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్  సంస్థకు చెందిన రాప్టర్  ఇంజిన్ మాత్రమే అంతరిక్ష ప్రయోగాల్లో విజయవంతంగా వాడుకలో ఉంది.   ఈ టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్ల భవిష్యత్తులో తక్కువ ఖర్చుతో కూడిన, ఇంధనాన్ని మళ్లీ ఉపయోగించిన రాకెట్లను సొంతంగా తయారు చేసుకోవచ్చు. దీంతో అంతరిక్ష వాణిజ్య మార్కెట్లో ఇండియా మరింత  శక్తివంతమైన దేశంగా ఎదుగుతుంది. 

©️ VIL Media Pvt Ltd.