Reading Time: 3 minutes
Korean Kanakaraju: వీకెండ్‌లో దుమ్మురేపిన ‘కొరియన్ కనకరాజు’.. రెండో రోజుల్లో మొత్తం ఎన్ని కోట్లు వచ్చాయంటే?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు బిగ్ రిలీఫ్ లభించింది. గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాప్ లతో సతమతవుతోన్న ఈ మెగా హీరోకు ‘కొరియన్ కనకరాజు’ రూపంలో మంచి సాలిడ్ హిట్ దక్కింది. శుక్రవారం (ఆగస్టు 07) థియేటర్లలో రిలీజైన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ కు మరీ బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా డీసెంట్ టాక్ వస్తోంది. రివ్యూలు పాజిటివ్ గా రావడం, మౌత్ టాక్ బాగుండడంతో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఫస్ట్ డే కంటే రెండోరోజు ఈ సినిమాకు స్క్రీన్స్ పెరగడంతో ఈ మూవీ వసూళ్లు కూడా పెరుగుతున్నాయి. రిలీజైన మొదటి రోజే కొరియన్ కనకరాజు సినిమా రూ. 10 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇక వీకెండ్ కావడంతో శనివారం (ఆగస్టు 08) వరుణ్ సినిమా కలెక్షన్లు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో కలిపి మొత్తం 23.6 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు కొరియన్ కనకరాజు చిత్ర బృందం వెల్లడించింది. ఈ మేరకు కలెక్షన్ల వివరాలను చెబుతూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

కాగా ఓవర్సీస్ లోనూ కొరియన్ కనకరాజు సినిమాకు కాసుల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా యూఎస్‌ఏ లో వరుణ్ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. అక్కడ ఇప్పటికే ఈ చిత్రం 250K డాలర్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం వెల్లడించింది. మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ కామెడీ హరర్ థ్రిల్లర్ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ గా నటించింది. కమెడియన్ సత్య మరో కీలక పాత్రలో మెరిశాడు. వీరితో పాటు సునీల్, మురళీధర్ గౌడ్, తులసి, వీటీవీ గణేష్, బుల్లిరాజు, మహేష్ ఆచంట తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. థమన్ ఈ మెగా మూవీకి సంగీతం అందించారు.

రెండు రోజుల్లో 23 కోట్లకు పైగా కలెక్షన్లు..

ఓవర్సీస్ లోనూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.