
కామారెడ్డి, వెలుగు: పీఆర్సీ కాలపరిమితి ముగిసి మూడేండ్లు అయినా ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోవటం శోచనీయమని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. పీఆర్టీయూ కామారెడ్డి జిల్లా సర్వసభ మీటింగ్శనివారం ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించారు. హాజరైన శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్1 లోపు 51 శాతం ఫిట్మెంట్ పీఆర్సీ ప్రకటించాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
పీఆర్సీ టీచర్లకు భిక్ష కాదని, వారికి ప్రభుత్వం ఇవ్వాల్సిన హక్కు అని అన్నారు. ఈహెచ్ఎస్ కార్డు పూర్తిస్థాయిలో అమయ్యేలా కృషి చేస్తామన్నారు. పీఆర్టీయూ స్టేట్ ప్రెసిడెంట్ దామోదర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ బిక్షంగౌడ్, అధికార ప్రతినిధి మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల్లో జిల్లా ప్రెసిడెంట్‌గా అల్లాపూర్ కుషాల్, జనరల్ సెక్రటరీగా పుట్ల శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.