Reading Time: 2 minutes

Mahesh Babu: హ్యాపీ బర్త్ డే MB.. మహేష్‌పై నమ్రత ప్రేమ వర్షం.. ఫిదా అవుతున్న సూపర్‌స్టార్ ఫ్యాన్స్

Caption of Image.

టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్లో సూపర్​స్టార్ మహేష్ బాబు, భార్య నమ్రతా శిరోద్కర్ ముందువరుసలో ఉంటారు. తెరపై హీరోహీరోయిన్లుగా పరిచయమైన ఈ ఇద్దరూ.. ఆ తర్వాత నిజ జీవితంలోనూ ప్రేమలో పడి పెళ్లితో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒకరికొకరు అండగా నిలుస్తూ ఆదర్శ దంపతులుగా కొనసాగుతున్నారు. ఇవాళ మహేష్ బాబు తన 50వ పుట్టినరోజు సందర్భంగా భార్య నమ్రత చేసిన స్పెషల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హ్యాపీ బర్త్ డే MB!: నమ్రత క్రేజీ విషెస్

మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా నమ్రతా శిరోద్కర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పెషల్ విషెస్ తెలిపారు. మహేష్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. “హ్యాపీ బర్త్ డే MB! ప్రతిరోజును ఎంతో ప్రత్యేకంగా మార్చినందుకు ధన్యవాదాలు. నీకు అత్యంత ఆనందకరమైన పుట్టినరోజు కావాలని కోరుకుంటున్నాను. ప్రేమ, మంచి ఆరోగ్యం, అంతులేని సంతోషంతో నిండిన ఏడాది నీ సొంతం కావాలి. మేము నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాం” అంటూ తన ప్రేమను చాటుకున్నారు.

నమ్రత చేసిన ఈ పోస్ట్‌కు మహేష్ అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది. తమ అభిమాన హీరోకు భార్య నమ్రత ఇచ్చిన బర్త్ డే విషెస్ ఎంతో అందంగా ఉన్నాయంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

‘వంశీ’తో మొదలైన పరిచయం..

మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ప్రేమకథకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వీరిద్దరూ తొలిసారి ‘వంశీ’ సినిమాలో కలిసి నటించారు. 2000లో విడుదలైన ఈ చిత్రంలో మహేష్, నమ్రత ఆన్‌స్క్రీన్ జోడీగా కనిపించారు. సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి.. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది.

1993లో ఫెమీనా మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్న నమ్రతా శిరోద్కర్.. మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించారు. తెలుగులో మాత్రం మహేష్ బాబుతో కలిసి నటించిన ‘వంశీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అనంతరం ‘అంజి’ వంటి చిత్రాల్లోనూ కనిపించారు.

ప్రేమకు పెళ్లి రూపం

‘వంశీ’ సినిమా సమయంలో మొదలైన మహేష్, నమ్రతల ప్రేమ కొంతకాలానికి పెళ్లి బంధంగా మారింది. 2005లో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం నమ్రత సినిమాలకు పూర్తిగా దూరమై కుటుంబ జీవితానికే ఇంపార్టెన్స్ ఇచ్చింది. మహేష్ బాబు సినీ కెరీర్‌లో వరుస విజయాలతో ముందుకు సాగుతుండగా.. నమ్రత ఆయన వ్యక్తిగత జీవితంతో పాటు ప్రొఫెషనల్ జర్నీలోనూ కీలకంగా అండగా నిలుస్తున్నారు. మహేష్ సినిమాలు, బ్రాండ్ కమిట్‌మెంట్స్, కుటుంబ బాధ్యతలు ఇలా అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ నమ్రత తనదైన పాత్ర పోషిస్తున్నారు.

బ్యూటీఫుల్ ఫ్యామిలీ 

మహేష్, నమ్రత దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు గౌతమ్ ఘట్టమనేని, కుమార్తె సితార ఘట్టమనేని. కుటుంబంతో కలిసి గడిపే ప్రతి క్షణాన్ని మహేష్, నమ్రత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సినిమా రంగంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయించడం మహేష్ ప్రత్యేకత. మరోవైపు నమ్రత కూడా కుటుంబాన్ని ఎంతో అందంగా చూసుకుంటూ.. మహేష్‌కు ప్రతి అడుగులోనూ తోడుగా నిలుస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.