
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ప్రతి రాశికి ఒక గ్రహం అధిపతిగా ఉంటారు. ఆ గ్రహాన్ని బట్టి అదృష్ట రంగులు నిర్ణయించబడతాయి. సాధారణంగా బయటకు వెళ్లే టప్పుడు పర్స్ లో డబ్బులు పెట్టుకొని బయటకు వెళతారు. అయితే రాశిని బట్టిని పర్స్ కలర్ ను ఎంచుకోవాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. సరైన రంగు పర్సు వాడటం వలన అదృష్టం కలిసి వచ్చి.. పర్సు ఎప్పుడూ ఖాళీ అవదని.. లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు 12 రాశుల వారు ఎవరు ఎలాంటి రంగు పర్స్ వాడాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం…!
జ్యోతిష్యం ప్రతి రాశి వారికి ఒక నిర్దిష్టమైన అదృష్ట రంగు ఉంటుంది. ఆ రంగు పర్సు వాడటం వల్ల ధనాకర్షణ పెరిగి , ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
- మేష రాశి : ముదురు గులాబీ రంగు, ఎరుపు, నారింజ
- వృషభ రాశి : పింక్ కలర్, ఆకుపచ్చ, తెలుపు రంగులు.
- మిథున రాశి: బూడిద రగు, లేత ఆకుపచ్చ, పసుపు రంగుల పర్స్ లు
- కర్కాటక రాశి : పాల రంగు షేడ్ కలర్, సిల్వర్, తెలుపు రంగు పర్సు
- సింహ రాశి : పర్పుల్, గోల్డ్ కలర్ , ఆరెంజ్
- కన్యా రాశి: నేవీ బ్లూ, ఆకుపచ్చ, మట్టి , గోధుమ రంగు
- తుల రాశి : లేత నీలి రంగు, తెలుపు, గులాబీ రంగు పర్స్
- వృశ్చిక రాశి : మెరూన్ కలర్, బ్లాక్ కలర్, ముదరు ఎరుపు రంగు పర్స్
- ధనుస్సు రాశి : బ్లూ కలర్, రాయల్ కలర్, పర్పుల్ కలర్, లేత రంగు పర్స్‌లు
- మకర రాశి: ముదురు రంగు పర్స్ లు, నలుపు, గోధుమ రంగు
- కుంభ రాశి : బ్లూ కలర్, గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ కలర్ పర్స్‌లు
- మీన రాశి : లేత రంగులు, గ్రీన్ కలర్, సముద్రంలోని నీటి కలర్ పర్స్ లు
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.